విషాదం: తుపాకీ మిస్‌ఫైర్: కానిస్టుబుల్ తలలోకి బుల్లెట్, మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తుపాకీ మిస్‌ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తిర్యానీ పోలీస్ స్టేషన్‌లో
తుపాకులు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కిరణ్ కుమార్ అనే కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే అప్రమత్తమైన ఎస్సై, తోటి కానిస్టేబుళ్లు హుటాహుటిన గాయపడ్డ కానిస్టేబుల్‌ను 108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, కానిస్టేబుల్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

 gun misfire in asifabad district a constable dead

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చౌటపల్లికి చెందిన కిరణ్ కిరణ్ కుమార్.. 132వ బెటాలియన్ బీ కంపెనీలో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా, గత ఐదు నెలలుగా తిర్యానీ పోలీస్ స్టేషన్‌లోనే కిరణ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కిరణ్ కుమార్ మృతితో అతని కుటుంబంతోపాటు చౌటపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+