పోర్న్ వీడియోలు చూస్తావా..? హాజీపూర్ హత్య కేసుల నిందితుడికి కోర్టు ప్రశ్న..

హాజీపూర్‌ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిపై విచారణను ఫోక్సో స్పెషల్‌ కోర్టు జనవరి 3వ తేదీకు వాయిదా వేసింది. మనీషా హత్య కేసుకు సంబంధించి గురువారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా 29 మంది సాక్ష్యుల వాంగ్మూలాలను న్యాయమూర్తి చదివి వినిపించారు.

వాటిపై శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించగా.. చాలా ప్రశ్నలకు కాదు,లేదు,తెలియదంటూ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. నీ తరుపున ఎవరైనా సాక్షులను తీసుకువస్తావా..? అని న్యాయమూర్తి అడగ్గా.. కుటుంబ సభ్యులను తీసుకువస్తానని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. దీంతో జనవరి 3వ తేదీ వారిని కోర్టుకు తీసుకురావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

 hajipur serial killer srinivasa reddy case adjourned to january 3rd

గురువారం విచారణ సందర్భంగా కర్నూలులో జరిగిన సువర్ణ హత్య కేసు గురించి కూడా న్యాయమూర్తి నిందితుడిని విచారించారు. సువర్ణ హత్యతో నీకేమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా లేదని బదులిచ్చాడు. అసలు ఆమె ఎవరో తెలియదని చెప్పాడు.

మరి బాలిక దుస్తులపై ఉన్న స్పెర్మ్, రక్తపు మరకల ఆనవాళ్లు నీవేనని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలిందని న్యాయమూర్తి చెప్పగా.. ఎస్‌ఓటీ పోలీసులే సిరంజీతో దుస్తులపై వాటిని చల్లారని చెప్పినట్టు సమాచారం.ఇక పోర్న్ వీడియోలు చూస్తావా..? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తన వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ లేదని చెప్పినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+