కెసిఆర్‌కు అలవాటే: కేంద్రమంత్రి, వరంగల్‌లో మీరా కుమార్ ప్రచారం
వరంగల్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి, టిడిపి, టిఆర్ఎస్ పార్టీల తరఫున ముఖ్యనేతలు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీయే (బిజెపి-టిడిపి) అభ్యర్థి దేవయ్య తరఫున కేంద్రమంత్రి హంసరాజ్ గంగారామ్ ఆదివారం ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు. మాటిమాటికి ఉప ఎన్నికలు తేవడం సిఎం కెసిఆర్‌కు అలవాటు అని ఎద్దేవా చేశారు. వరంగల్‌ను తెలంగాణ రెండో రాజధాని తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తరఫున మాజీ స్పీకర్ మీరా కుమార్ ప్రచారం చేశారు. ఆమె భూపాలపల్లిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో జానారెడ్డి, వి హనుమంత రావు, కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్‌కు బుద్ధి చెప్పాలి: ఉత్తమ్
వరంగల్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కెసిఆర్ అహంకారంతోనే ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. ఇచ్చిన హామీల పైన మంత్రులను ప్రజలు నిలదీయాలని సూచించారు. పత్తికి మద్దతు ధర లేకపోడవంపై మాట్లాడుతూ... అది ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్ పాపమే అన్నారు.
బూర నర్సయ్యకు చేదు
భువనగిరి ఎంపీ, టిఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్‌కు జనగామలో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా తమను పట్టించుకోవడం లేదని సొంత పార్టీ కార్యకర్తలే ఆయనను నిలదీశారు.












Click it and Unblock the Notifications