రేవంత్ సర్కారుకు హరీశ్ రావు హెచ్చరిక

Harish Rao: సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. పార్టీ నేతలతో కలిసి కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పంటలు ఎండిపోతుంటే రైతన్నలు కన్నీటిపర్యంతమవుతున్నారని.. అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని రైతులే చెబుతున్నారని హరీశ్ వ్యాఖ్యానించారు. సాగునీరు లేదు.. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు. రాష్ట్రమంతటా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ముఖ్యమంత్రికి మాత్రం ఈ విషయం పట్టడం లేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

Harish Rao hits out at congress govt for farmers issues

ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి సీఎం రేవంత్‌కు ఆలోచన లేదని హరీశ్ రావు విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పుల గురించి నోటీసులు ఇస్తున్నారన్నారు. అప్పులు చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రజాకార్లను తలపించేలా వాళ్లు ప్రవర్తిస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం రుణమాఫీపైనే పెడతానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా దీనిపై నిర్ణయం తీసుకోలేదని హరీశ్ రావు విమర్శించారు. రైతులకు ఇచ్చిన 4 హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం రైతుల‌ను ద‌గా, మోసం చేసిందని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమ‌లు చేయ‌లేదని మండిపడ్డారు హరీశ్ రావు.

రైతుల విష‌యంలో డిసెంబ‌ర్ 9న రుణ‌మాఫీ చేస్తామ‌న్నారు. కౌలు రైతుల‌కు ఎక‌రానికి రూ. 15 వేలు, వ్య‌వ‌సాయ‌ కూలీల‌కు రూ. 12 వేలు, వ‌రి పంట‌కు క్వింటా‌ల్‌కు రూ. 500 బోన‌స్ ఇస్తామ‌న్నారు. ఇవి ఏవీ అమలు చేయాలని హరీశ్ రావు విమర్శించారు. రైతుల‌ను న‌ట్టేట ముంచింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ఏ ముఖం పెట్టుకుని పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఓట్లు అడుగుతారు..? బాండు పేప‌ర్ల సాక్షిగా రైతుల‌ను మోసం చేశామ‌ని ఓట్లు అడుగుతారా..? అని హరీశ్ రావు నిలదీశారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ ప్ర‌భుత్వం దిగిరాక‌పోతే రాష్ట్రంలోని ల‌క్ష‌లాది రైతుల‌తో సెక్ర‌టేరియ‌ట్‌ను ముట్టడించ‌డానికి బీఆర్ఎస్ పార్టీ వెనుకాడ‌ద‌ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు హరీశ్ రావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+