నిర్మలా సీతారామన్‌ను కలిసిన హరీశ్ రావు: తెలంగాణకు నిధులపై సానుకూల స్పందన

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుభేటీ అయ్యారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతి పత్రం అందజేశారు.

వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక గ్రాంటు కింద ఏటా రూ. 450 కోట్లు రావాల్సి ఉందన్నారు. 2014-15, 2019-20, 2021-2022-23 సంవత్సరాలకు సంబంధించి నిధులు ఇంత వరకూ విడుదల కాలేదని తెలిపారు. అంతేగాక, జీఎస్టీ వసూళ్లపై తెలంగాణకు పరిహారం కింద 2020-221, 2021-22, 2022-23 సంవత్సరాలకు సంబంధించి రూ. 698.97 కోట్లు రావాల్సి ఉందని కేంద్రమంత్రికి హరీశ్ రావు చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. తాను చెప్పిన అంశాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని హరీశ్ రావు తెలిపారు.

 Harish Rao meets union minister Nirmala Sitharaman about GST funds.

మరోవైపు, జీఎస్టీ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..రాష్ట్రానికి కింద రావాల్సిన బకాయిలు, ఇతర రాష్ట్రాల పేరుతో నమోదు చేసిన వాణిజ్య సంస్థలకు పన్ను చెల్లింపుల తీరు గురించి తెలిపారు. 2021-22కు సంబంధించి తెలంగాణకు రూ. 164.43 కోట్లు ఇవ్వాలని అకౌంటెంట్ జనరల్(ఏజీ) కార్యాలయం కూడా ధృవీకరణ పత్రం ఇచ్చింది. మిగిలిన రూ. 534.54 కోట్లకు కూడా ఇవ్వాలని కోరామన్నారు.

ఐజీఎస్టీ పద్దు కింద మరో రూ. 112.99 కోట్లు రావాలని గత మే నెలలో లేఖ రాశామన్నారు. వీటిని ఇప్పటికైనా విడుదల చేయాలన్నారు. జీఎస్టీ చెల్లింపుల్లో కొన్ని వాణిజ్య సంస్థలు సరుకుల రవాణా ప్రాంతాలను తప్పుగా ప్రకటిస్తున్నాయని తెలిపారు. దీని వల్ల వాటిని వినియోగించే తెలంగాణ వంటి రాష్ట్రాలకు పన్ను ఆదాయం రాక నష్టం జరుగుతోందని హరీశ్ రావు వివరించారు.

మహారాష్ట్రలోని ఐసీఐసీఐ లిమిటెడ్ సంస్థ నుంచి రూ. 82.38 కోట్లు రావాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఈ సమస్యకు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు కూడా ఉందని తెలిపారు. గత జీఎస్టీ మండలి సమావేశంలోనూ ఈ సమస్యను ప్రస్తావించినా.. ఇంత వరకూ ఎలాంటి చర్యలు లేవని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమస్య పరిష్కారానికి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+