ల్యాంకోపై హరీష్, 'టీడీపీ వారే నేతలని కేసీఆర్ భావన'
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వక్ఫ్ భూములు ల్యాంకోకు కట్టబెట్టినప్పుడు తప్పు కనిపించలేదా అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు బుధవారం మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిజాం షుగర్స్‌ను విక్రయించినప్పుడు ఎందుకు నోరు మెదపలేదన్నారు.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు భూముల అమ్మకాల విషయమై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై హరీష్ రావు ధీటుగా స్పందించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు.

సచివాలయాన్ని సనత్‌నగర్‌కు తరలించడంపై ఆ యాపార్టీల నేతల ఆరోపణలను ఖండించారు. ఎర్రగడ్డకు ఎవరిని పంపించాలో ప్రజలకు తెలుసన్నారు. రెండువారాల్లో మిషన్ కాకతీయ పనులు ప్రారంభిస్తామని, జిల్లా ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రతీవారం సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
టీడీపీలో పని చేస్తే కేసీఆర్ పదవులిస్తారు: నన్నూరి
కేసీఆర్ దృష్టిలో నేతలు అంటే టీడీపీలో పని చేస్తున్న వారేనని, అందుకే వారిని పిలిచి మరీ పదవులు ఇస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి విమర్శించారు. తెరాసలో పదవుల కోసం ఎదురు చూస్తున్న వారంతా వెంటనే టీడీపీలో చేరితే, కేసీఆర్ పిలిచి మరీ పదవులిస్తారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications