తెలంగాణపై చంద్రబాబు పాజిటివ్‌గా మాట్లాడారు: హరీశ్ రావు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలపై ఆయనకు ప్రేమ ఉండదని అన్నారు. సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ రావు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సిద్దిపేట రూరల్ మండలం తోర్నాలలో 48 కోట్ల రూపాయలతో చేపట్టిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ వ్యవసాయ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఒక్క డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. మరోవైపు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించాలన్నారు. 2014కు ముందు రెసిడెన్షియల్ విద్యపై పెట్టిన ఖర్చు రూ. 970 కోట్లు అని.. ఇప్పుడు రూ. 4000 కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామని హరీశ్ రావు తెలిపారు.

ఇక చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ.. ఆయనకు ఎప్పుడూ తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉండదని అన్నారు. అయితే, మొన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ భూములపై పాజిటివ్‌గా మాట్లాడారన్నారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం భూమి అమ్ముకుంటే.. తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేదని.. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారని హరీశ్ రావు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే పనులు ఎక్కువ.. ప్రచారం చేసేది తక్కువన్నారు మంత్రి హరీశ్ రావు. ఇంత మంచి ప్రభుత్వాన్ని.. చేసిన సేవలను గుర్తించి మరోసారి ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు పంజాబ్ వరి ధాన్యంలో మొదటి స్థానంలో ఉంటే.. ఇప్పుడు తెలంగాణ నెంబర్ వన్‌గా మారిందన్నారు. అంతేగాక, డాక్టర్ల ఉత్పత్తిలోనూ తెలంగాణ నెంబర్ వన్‌గా మారిందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చి తెలంగాణలో ట్రీట్మెంట్ చేయించుకున్నారని హరీశ్ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications