HCU: కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వ కీలక నిర్ణయం
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థులు, ప్రజా సంఘాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది.
సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తామన్న డిప్యటీ సీఎం భట్టి
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని తెలంగాణ డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్న భట్టి విక్రమార్క.. న్యాయం తప్పకుండా గెలుస్తుందన్నారు. సుప్రీంకోర్టు అడిగిన సమాచారాన్ని గడువులోగా పంపిస్తామని తెలిపారు. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని సైబరాబాద్ కమిషనర్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీని ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై విజయశాంతి ఫైర్
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు చెందిన ఐఎంజి సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కేటాయించడం తెలంగాణ బీజేపీ దృష్టిలో న్యాయం. సహేతుకం అని అన్నారు.
ఐఎంజి సంస్థ ఈ 400 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం కట్టకుండా.. ఈ భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు అది అన్యాయం అనిపించలేదు. ఎందుకంటే 2004 లో బీజేపీ కూటమిలో టీడీపీ ఉన్నప్పుడే ఐఎంజి సంస్థకు చంద్రబాబు గారు 400 ఎకరాల స్థలాన్ని బదలాయించారు కాబట్టి , ఇప్పుడు బీజేపీ నేతలు ప్రస్తావించే తప్పులన్నీ అప్పుడు వాళ్లకు గుర్తు రాలేదన్నారు విజయశాంతి.
ప్రస్తుతం ఈ 400 ఎకరాలపై కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొట్లాడి , ఈ భూముల్ని కాపాడి, వాటిని అమ్మి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం నేరమంటూ తెలంగాణ బీజేపీ నేతలు నానా యాగి చేస్తున్నారు..మరి 2004లో ఐఎంజి సంస్థకు ఈ భూముల్ని అప్పచెప్పడం తెలంగాణ బీజేపీ నేతల దృష్టిలో నేరం అనిపించలేదా.. అవకాశవాద రాజకీయాలు చేయకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని తెలంగాణ సమాజం బీజేపీ నేతలను నిలదీస్తుంది అని విజయశాంతి అన్నారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications