ఏకంగా సీఎంఓనే వాడేశాడు .. అద్దె కార్లంటూ నిలువునా ముంచాడు
హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా సీఎంఓలో కార్లు అద్దెకు పెడతామంటూ అద్దె పేరుతో కార్లు తీసుకుని వాటిని తనఖా పెట్టి సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్ళ గుట్టు రట్టయింది . సీఎంఓ పేరును వాడేసి ఇష్టారాజ్యంగా మోసాలు చేసిన ఇద్దరిని ఎల్బీ నగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2 కోట్ల 45లక్షల 70వేల విలువైన 23 కార్లు, 4 సెల్ ఫోన్లు, రూ. 4.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సీఎంఓలో కార్లు అద్దెకు పెట్టిస్తానని మోసం చేసిన కేటుగాడు
ప్రధాన నిందితుడు అయిన కందుల శ్రీకాంత్‌చారి అలియాస్ అమ్ముల శ్రీకాంత్ చేసిన మోసం వింటే షాక్ తింటారు . 7వ తరగతి వరకు చదువుకున్న ఈ కేటుగాడు 2017లో 10 నెలల పాటు సీఎం కార్యాలయంలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేశాడు. డ్యూటీకి సరిగా రాకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తరువాత సీఎంఓ ఆఫీస్ పేరునే వాడేసిన ఈ కేటుగాడు విలాసాలకు ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు అమాయకులను నమ్మింఛి మోసం చెయ్యటం ప్రారంభించాడు . తనకు తెలిసిన అధికారుల దగ్గర కార్లను అద్దెకు పెట్టిస్తానని జనాలను నమ్మించి ఆ తర్వాత వాటిని అమీర్‌పేట్ కు చెందిన సర్దార్ మహేందర్‌సింగ్ అలియాస్ బంటు అనే ఫైనాన్షియర్ దగ్గర తనఖా పెట్టేవాడు.

కార్లను తనఖా పట్టి జల్సాలు చేసిన మోసగాడు
శ్రీకాంత్ కార్లను అప్పగించినందుకు ఫైనాన్షియర్ బంటు శ్రీకాంత్ కి రూ. 4 లక్షలు ఇచ్చేవాడు. అలా వచ్చే డబ్బును కార్ల ఓనర్లకు నెలకు రూ.30 వేల చొప్పున వారికి అనుమానం రాకుండా చెల్లించేవాడు . అలా అతడి మాయమాటల నమ్మిన కొంతమంది తమ కార్లను ఇచ్చేవారు. మొదటి నెల అద్దె డబ్బులు మాత్రమే ఓనర్లకు ఇచ్చేవాడు. తర్వాత నెల.. కార్ల ఓనర్లకు డబ్బులివ్వకుండా.. ఫోన్ చేస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరిగేవాడు. దీంతో అనుమానం వచ్చిన కార్ల ఓనర్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. శ్రీకాంత్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

సీఎంఓ పేరు చెప్పి టోకరా వేసిన కేటుగాళ్ళ అరెస్ట్
సదరు కార్లలో ఏడింటిలో జీపీఎస్ ఉండడంతో యజమానులు వాటిని గుర్తించి వెనక్కి తీసుకెళ్లారు. అలా లేని వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. ఇంకా 23 కార్లు మహేందర్‌సింగ్ అధీనంలోనే ఉన్నాయి. పోలీసులు వారిని అరెస్ట్ చేసి కార్లను స్వాధీనం చేసుకున్నారు.మొత్తానికి సీఎంఓ పేరు చెప్పి ఇంత మందికి టోకరా వేసిన మోసగాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసి వీరి ఆట కట్టించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications