ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!!

ఉద్యోగుల బకాయిల పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చెల్లింపు కు ప్రభుత్వానికి డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందుకోకుండానే 86 మంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు చనిపోవటంపై ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ వేళ ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కాకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిల చెల్లింపు కోసం కోర్టును ఆశ్రయించిన పిటీషనర్లకు నిర్దేశించిన సమయం లోగా పేమెంట్ చేయాలని స్పష్టం చేసింది.

ఉద్యోగుల బకాయిల పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు లో ప్రభుత్వం నుంచి రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాల బకాయిల కోసం రిట్‌ పిటిషన్లు, కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసిన 2600 మంది విశ్రాంత ఉద్యోగులకు.. ఏప్రిల్‌ 9లోగా బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందుకోకుండానే 86 మంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు చనిపోవటంపై ఆవేదన వ్యక్తం చేసింది. జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ ఫారం-1 నోటీసు జారీ చేసినప్పటికీ, హాజరుకాకపోవటం ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో సందీప్‌కుమార్‌ రాలేదని ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని ముందే తెలిసినప్పుడు హైకోర్టులో అప్లికేషన్‌ దాఖలు చేసి మినహాయింపు తీసుకోవాలి కదా? అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎంత రాత్రి వరకైనా కోర్టులోనే ఉంటామని.. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు.

high-court-has-ordered-the-state-government-to-disburse-retirement-benefits-of-all-the-government-em

హైకోర్టు కీలక వ్యాఖ్యలు... చెల్లింపు పై ఆదేశాలు

కాగా, సాయంత్రం 4 గంటలకు సందీప్‌కుమార్‌ సుల్తానియా.. జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఎదుట వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. 2600 మంది విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు క్లియర్‌ చేయాలని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టంచేసింది. ఏప్రిల్‌ 9 లోగా బకాయిలు ఇవ్వకపోతే.. ఈసారి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుందని తెలిపింది. 'ఉద్యోగ విరమణ చేసిన టీచర్లు, ఇంజినీర్లు, హెడ్‌మాస్టర్లు, పోలీసులు, ఇతర శాఖల ఉద్యోగులు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ మంజూరు చేయాలని పేర్కొంటూ 9 నెలల కిందటే పిటిషన్లు వేశారు. బకాయిలివ్వాలని ఈ కోర్టు తీర్పు ఇచ్చినా ఆదేశాలు అమలు కాలేదు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా వేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్లలో ఫారం-1 నోటీసు ఇచ్చినా మీరు బకాయిలు ఇవ్వలేదు. ఇది వాళ్లకు రావాల్సిన డబ్బు... వాళ్లకు రావాల్సిందే అడుగుతున్నారు. కేసులు నడుస్తుండగానే 86 మంది విశ్రాంత ఉద్యోగులు చనిపోయారు' అని జస్టిస్‌ రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. సందీప్‌కుమార్‌ సుల్తానియా వివరణ ఇస్తూ మొత్తం 3,650 టోకెన్లలో ఇప్పటికే 1056 క్లియర్‌ చేశామని.. ఇంకా 2600 టోకెన్లు ఏప్రిల్‌ 31 లోగా క్లియర్‌ చేస్తామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఏప్రిల్‌ 9 వరకు గడువు ఇస్తున్నామని.. ఆలోగా బకాయిలు చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+