నడిరోడ్డుపై ఇంటింటి సర్వే పత్రాలు: కాప్రా తహసీల్దార్ సస్పెండ్
మేడ్చల్ మల్కాజిగిరి: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే పలువురు అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతున్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో ప్రజల వద్ద నుంచి సేకరించిన సమగ్ర ఇంటింటి సర్వే పత్రాలు రోడ్లపై దర్శనమిస్తుండటం శోచనీయం. తాజాగా, జవహర్‌నగర్ మున్సిపల్ కమిసనరేట్ పరిధిలోని వార్డు నంబర్ 27కి సంబంధించిన సమగ్ర ఇంటింటి సర్వే పత్రాలు తార్నాక రోడ్లపై ప్రత్యక్షమయ్యాయి.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ గౌతమ్ సీరియస్ అయ్యారు. ఘటనకు బాధ్యులుగా పరిగణిస్తూ సంబంధిత అధికారిపై చర్యలు తీసుకున్నారు. సర్వేలో భాగంగా సదరు వార్డుకు సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న కాప్రా మంల తహసీల్దార్ జ్యోతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే జవహర్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రోడ్డుపై పడిపోయిన పత్రాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కాగా, మరో ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. తాజాగా, ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
నాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు..
— Harish Rao Thanneeru (@BRSHarish) November 22, 2024
నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు..
ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం.
రోడ్ల పై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం?
సామాజిక, ఆర్థిక, విద్య,… pic.twitter.com/aDHaNLBuhg
'నాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు.. నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు.. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం. రోడ్ల పై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం? అని హరీశ్ రావు రేవంత్ సర్కారును నిలదీశారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేపర్స్.. రోడ్డు మీద పడేసిన అధికారులు ..మేడ్చల్ ..రేకుల బై దగ్గర నుండి ఎల్లంపేట వరకు..🙈🙈🙉🙉📸📸 pic.twitter.com/2vDM5SAjAX
— Gade Shekar BRS. 🚘 (@ShekarGade38658) November 15, 2024
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమవుతున్నది. సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రజల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన పట్ల సీరియస్ గా స్పందించాలని, ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications