బీజేపీ బీసీ సీఎం ఎలా చేస్తుంది?: కేసీఆర్‌కు బైబై చెప్పాలంటూ రాహుల్ గాంధీ

మహబూబ్‌నగర్: ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు కలలుగన్నారని.. అయితే, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక కుటుంబానికే మేలు జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉద్యోగాలు, పదవులు అన్నీ ఓకే కుటుంబానికి దక్కాయన్నారు. ప్రస్తుతం దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య పోటీ నడుస్తోందన్నారు. కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లు దోచుకుందని ఆరోపించారు రాహుల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో భారీ ప్రాజెక్టులను నిర్మించిందన్నారు. కానీ, రూ. లక్షన్నర కోట్లతో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పుడే బీటలు పడుతుందని.. కాళేశ్వరం పిల్లర్లన్నీ ఒక్కొక్కటిగా కూలుతున్నాయని మండిపడ్డారు.

 HOw bjp makes BC CM in telangana?: Rahul Gandhi, hits out at bars in Kalwakurthy public meeting

కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులైన ప్రజలకు ఇళ్లు, భూములు ఇచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ మాత్రం ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేదల భూములను లాక్కున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములనూ లాక్కున్నారని మండిపడ్డారు. ధరణి వల్ల ఒకే కుటుంబం బాగుపడిందని విమర్శించారు. కీలక శాఖలన్నీ కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో ఉన్నాయని.. ముందు కేసీఆర్ ను సీఎం కుర్చీలోనుంచి దించి బైబై చెప్పాలని ప్రజలకు రాహుల్ పిలుపునిచ్చారు.

ఓబీసీని ముఖ్యమంత్రిని చేస్తానని బీజేపీతోంది. రెండు శాతం ఓట్లు వచ్చే బీజేపీ.. ఓబీసీని సీఎం ఎలా చేస్తుంది? బీజేపీ మాటలు చాలా హస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసం మహిళలు ఎంతో కష్టపడుతున్నారు. రాష్ట్రం కోసం, కుటుంబం కోసం కష్టపడే మహిళలకు న్యాయం జరగాలి. అందుకే మహిళలకు ప్రతినెలా రూ.2500 ఖాతాల్లో వేస్తామని రాహుల్ వ్యాఖ్యానించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ రూ. వెయ్యికి పెంచింది. కాంగ్రెస్ గెలిస్తే.. రాష్ట్రంలో రూ. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ దోచుకున్న సొమ్మునంతా ప్రజలకు పంచుతామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+