ఎవ‌రినైనా నిల‌బెట్టాలి..! కాని కొడంగ‌ల్ లో కొట్టాలి..!!

తెలంగాణ‌లో ఫైర్ బ్రాండ్ గా ముద్రప‌డ్డ ఆ నాయ‌కుడు ముచ్చ‌ట‌గా మోడోసారి గెలిచేందుకు ఆ నియోజ‌క వ‌ర్గంలో పావులు క‌దుపుతున్నారా? ఆ నాయుకున్నే టార్గెట్ గా పెట్టుకు అదికార పార్టీ వ్యూహాల‌కు ప‌దును పెడుతోందా..? ఆ నియోజ‌క వ‌ర్గ ఎమ్మెల్యే బ‌లం-బ‌ల‌హీన‌త‌లమీదే అదికార పార్టీ ఎందుకు ద్రుష్టి కేంద్రీక‌రించింది...? స్థానికేత‌రుడికి సీటు కేటాయించి ఆ సిట్టింగ్ ఎమ్కెల్యేను ఓడించాల‌ని ఎందుకు ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు..? పెద్ద‌మొత్తంలో నిధుల‌ను ఆ ఒక్క నియోజ‌క వ‌ర్గానికి కేటాయించి అక్క‌డి ఎమ్మెల్యేని త‌రిమికొట్టాల‌ని ముఖ్య‌మంత్రి ఎందుకు పంతం ప‌ట్టారు..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

ఆ స‌ర్వే చూశాక అదికార పార్టీలో గుబులు... ప‌ట్నం సోద‌రుల‌తో పాగా వేయించేందుకు ప్ర‌య‌త్నాలు..

ఆ స‌ర్వే చూశాక అదికార పార్టీలో గుబులు... ప‌ట్నం సోద‌రుల‌తో పాగా వేయించేందుకు ప్ర‌య‌త్నాలు..

కొడంగ‌ల్ నియోజ‌వ‌ర్గంలో రేవంత్ రెడ్డి పొజిషన్ ఏమిటి ? కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డి మీద గురునాథరెడ్డి వారసులను బరిలోకి దిపింతే ఎలా ఉంటుంది ? అలా కాకుండా స్థానికేత‌రుడిని రంగంలోకి దింపితే ప‌రిస్థితి ఎలా ఉంటుంది..? రేవంత్ రెడ్డిని బలహీన పరిచే అంశాలేమిటి ? ఇవన్నీ అదికార పార్టీ నాయ‌కులు త‌మ‌లో తాము వేసుకుంటున్న‌ట్టు ప్ర‌శ్న‌ల‌ని స‌మాచారం ! రేవంత్ రెడ్డి పొజిషన్ ఏమిటో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించుకున్న సర్వేలోని ప్రశ్నల జాబితా ఇది. దీనితో పాటు ఇంకా చాలా అంశాల పై ఈ సర్వేతో సమాచారం సేకరించినట్టు తెలిసింది. రేవంత్ రెడ్డిని ఓడించే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? నియోజకవర్గంలో ఆయనకు బలమైన నాయకగణం ఎవరు? ఆయన వద్ద నుంచి ఎవరిని దూరం చేస్తే బాగా బలహీనపడతాడు లాంటి అంశాలపై ఈ సర్వేతో ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఓ సర్వే చేయించినట్టు తెలిసింది.

రేవంత్ మెజార్టీ త‌గ్గించాలి.. లేదంటే ఓడించాలి.. అదే టీఆర్ఎస్ ల‌క్ష్యం...

రేవంత్ మెజార్టీ త‌గ్గించాలి.. లేదంటే ఓడించాలి.. అదే టీఆర్ఎస్ ల‌క్ష్యం...

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి గెలుపు ఖాయం అన్నది సర్వేలో తేలిన సారాంశంగా విశ్వసనీయవర్గాలు చెప్పాయి. కనీసం 20 నుంచి 30 వేల మధ్య రేవంత్ రెడ్డికి మెజారిటీ కూడా ఖాయమని సీఎం చేయించుకున్న సర్వేలోనే స్పష్టమైందంటున్నారు. ఈ సర్వే చూశాక... రేవంత్ రెడ్డి ఓటమి కంటే, ఆయన మెజారిటీని భారీగా తగ్గించడం పైనే వ్యూహరచన చేయాలని అధికారపక్షం యోచిస్తోందట. ఏం చేస్తే రేవంత్ రెడ్డిని ఓడించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తుంద‌ట‌. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పుడు తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా సమర్పించారు. దీంతో కొడంగల్ కు ఉప ఎన్నిక తప్పదని అందరూ భావించారు. అధికారపక్షంతో పాటు రేవంత్ రెడ్డి అందుకు సిద్ధమయ్యారు. కాగా రేవంత్ రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీకర్ కు పంపలేదు. దీంతో ఉప ఎన్నికల అంశం అక్కడితో ఆగిపోయింది. ఆ సందర్భలోనే కొడంగల్ లో ఆపరేషన్ ఆకర్ష్ కు అధికారపక్షం శ్రీకారం చుట్టింది.

రేవంత్ ఓటిమి కోసం రంగంలోకి దిగిన‌ కేటీఆర్ అండ్ టీమ్...

రేవంత్ ఓటిమి కోసం రంగంలోకి దిగిన‌ కేటీఆర్ అండ్ టీమ్...

కొడంగ‌ల్ లో అదికార పార్టీ గెలుపు సాద్యాసాద్యాల‌పై అద్య‌య‌నం చేసే బాద్య‌త‌ల‌ను సీఎం కేసీఆర్, త‌న‌యుడు మంత్రి కేటీఆర్ కు అప్పగించారు. ఇక కేటీఆర్ తో పాటు మంత్రులు జూప‌ల్లి, మ‌హెంద‌ర్ రెడ్డి సైతం రేవంత్ బ‌లం, బ‌ల‌హీన‌త‌లు తెలుసుకుని కెటీఆర్ కి స‌హాయంగా రంగంలోకి దిగార‌ట‌. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి గట్టి మద్ధతుగా ఉంటారనుకున్న చాలా మంది నాయకులను నయానో భయానో టీఆర్ఎస్ వ‌ల‌వేసింది. ఈ పరిణామంతో రేవంత్ రెడ్డి పనైపోయిందని అంతా భావించారు. రేవంత్ చాలా బలహీనపడిపోయారని... ఎన్నికలంటూ వస్తే ఓటమి ఖాయమని భావించారు. కానీ, తాజా సర్వేతో అధికారపక్షానికి మైండ్ బ్లాంక్ అయినట్టు తెలుస్తోంది. ఎంతలా ప్రయత్నించినా రేవంత్ రెడ్డిని బలహీనపరచలేకపోవడం పై టీఆర్ఎస్ లో ఓ మోస్తరు మేథోమథనమే జరుగుతోందట. దీంతో వచ్చే ఎన్నికల నాటికైనా రేవంత్ రెడ్డి బలాన్ని బాగా తగ్గించాలన్న లెక్కతో అధికార పక్షం పథక రచన చేస్తోంది. గురునాథ్ రెడ్డి వారసులను బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా ఓ దశలో ఆలోచన చేశారట. అయితే, అది ఏ మాత్రం ఫలితాలు ఇవ్వదన్న విషయం సర్వేలో స్పష్టమైందట. ఇక మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డినే టీఆర్ఎస్ తన అభ్యర్థిగా ఖరారు చేసింది. వీలైనంత త్వ‌ర‌గా, రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ సీట్ల‌తో సంబందం లేకుండా ముందుగానే కొడంగ‌ల్ సీటును అధికారికంగా ప్ర‌క‌టించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తుందట‌ కేటీఆర్ అండ్ టీమ్.

కొడంగ‌ల్ నుండి రేవంత్ ను త‌రిమేయాలి.. అందు కోసం స్థానికేత‌రుడినిరంగంలోకి దింపుతున్న టీఆర్ఎస్..

కొడంగ‌ల్ నుండి రేవంత్ ను త‌రిమేయాలి.. అందు కోసం స్థానికేత‌రుడినిరంగంలోకి దింపుతున్న టీఆర్ఎస్..

కొడంగల్ లో తన సోదరుడుకి సీటు ఇప్పించుకోవాలన్న కోరికతో అక్కడ టీఆర్ఎస్ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో మంత్రి మహేందర్ రెడ్డి, కేటీఆర్ ఇప్ప‌టికే సంప్ప‌దింపులు చేశార‌ట‌. క్యాబినెట్ హోదా క‌లిగిన నామినేటెడ్ ప‌దవి ఇస్తామ‌ని కేటీఆర్ గురునాధ్ రెడ్డికి బ‌రోసా ఇవ్వ‌డం, కోడంగ‌ల్ లో గురునాధ్ రెడ్డికి అనుకూల ప‌వ‌నాలు లేక‌పోవ‌డంతో గురునాధ్ రెడ్డి సైతం స‌రె అన్నార‌ట‌. ఇక గురునాధ్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాగానే ప‌ట్నం సోద‌రులు స్పీడ్ పెంచేశారు. కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డిని ఒడించేందుకు ధ‌న‌బ‌లం, అంగ‌బ‌లం ఉన్న నేత‌గా ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని బ‌రిలోకి దించేందుకు కేటీఆర్ అండ్ అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్దం చేస్తోంది. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేందుకు స్థిర‌నివాసం ఏర్పాటు చేస్తున్నార‌ట‌. కొడంగ‌ల్ నియోజ‌వ‌ర్గంలో ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి సురుకైన నేత‌గా ఎదిగితే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం ప‌క్క‌కు పెట్టి కొడంగ‌ల్ ప్రాంతానికే ప‌రిమితం చేయ్యోచ్చు అని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు అని అంత‌ర్గ‌త స‌మాచారం. అయిన‌ప్ప‌టికి తెలంగాణ‌లో ఆ ఒక్క నియోజ‌క వ‌ర్గంలో గెలుపే ల‌క్ష్యంగా అదికార పార్టీ పావులు క‌దుపుతున్న‌ట్టు., అందుకు ఎంతైనా ఖ‌ర్చు చేసేందుకు సిద్దంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+