Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'3 నెలల్లో కాంగ్రెస్‌లో కీలక మార్పులు, అధికారంలోకి తెస్తాం, వారంతా ఓడిపోయేవారే'

రానున్న మూడుమాసాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకొంటాయని ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకొంటుందని ఆయన అభ

హైదరాబాద్: రానున్న మూడుమాసాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకొంటాయని ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. గతంలొ చేసిన తప్పులను చేయదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వంలేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన వెల్లడించారు, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామన్నారు

కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం

కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం


తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఇతర పార్టీల్లోకి చేరాల్సిన అవసరం తమకు లేదన్నారు. టిఆర్ఎస్ పార్టీలో తాము ఇమడలేమని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే తమకు సరిపోతోందన్నారు. వేరే పార్టీలో చేరాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇతర పార్టీల్లో చేరుతారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు రాజగోపాల్ రెడ్డి.

Recommended Video

    Uttam Kumar Reddy Warns To KCR and KTR
     మూడు మాసాల్లోనే తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు

    మూడు మాసాల్లోనే తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు


    రానున్న మూడు మాసాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన మార్పులు జరగనున్నట్టు రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టు ఆయన పరోక్ష సంకేతాలు ఇచ్చారు. గతంలో చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో చేయబోదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు.

    ఉత్తమ్ వెంట ఉన్నవారంతా ఓడిపోయేవారే

    ఉత్తమ్ వెంట ఉన్నవారంతా ఓడిపోయేవారే

    పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంట ఉన్నవారంతా ఓడిపోయే నేతలేనని ఆయన ఆరోపించారు.పార్టీని సమర్ధవంతంగా నడిపే నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో లేదన్నారు. ఈ నాయకత్వం ఉన్నప్పుడే ప్రజలు కాంగ్రెస్ పార్టీవైపుకు వస్తారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని సొమ్ముచేసుకొని ఓట్లుగా మలుచుకొనే యంత్రాంగం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఆ యంత్రాంగాన్ని సమకూర్చుకొంటే కాంగ్రెస్ పార్టీ వంద సీట్లను కైవసం చేసుకొంటుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

    పాదయాత్ర చేస్తే టిఆర్ఎస్ అడ్రస్ గల్లంతు

    పాదయాత్ర చేస్తే టిఆర్ఎస్ అడ్రస్ గల్లంతు

    తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నాయకత్వబాధ్యతలను తమకు అప్పగిస్తే రాష్ట్రవ్యాప్తంగా తమ సోదరులు పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహించి కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఆరుమాసాల పాటు పాదయాత్ర చేస్తే తెలంగాణలో టిఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపికి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉండాలనే విషయాన్ని తాను ఆలోచించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావడమనే విషయమై ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

    పిసిసి పదవిని ఇస్తే అధికారంలోకి తెస్తాం

    పిసిసి పదవిని ఇస్తే అధికారంలోకి తెస్తాం


    తమకు పిసిసీ చీఫ్ పదవిని కట్టబెడితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.తమ అభిప్రాయాన్ని అధిష్టానానికి చెప్పినట్టు చెప్పారు. అయితే మరోసారి అధిష్టానం వద్ద తమ అభిప్రాయాన్ని గట్టిగా విన్పిస్తామన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి అన్ని రకాల వ్యూహలు ఉన్నాయని చెప్పారు.గతంలో చేసిన తప్పులను పార్టీ నాయకత్వం ఈ దఫా చేయదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+