ఇంటిపై తల: క్షుద్రపూజలు, చిన్నారి బలి, క్యాబ్ డ్రైవర్ పనే
Recommended Video

హైదరాబాద్: ఓ ఇంటిపై చిన్నారి తల లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. ఆ ఇంటి యజమానే ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. ఇంటి యజమాని అయిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ చిన్నారిని బలి ఇచ్చినట్లు తేలింది.
ఈ నెల 1వ తేదీన ఉప్పల్ చిలుకానగర్‌లో గల రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఇంటిపై మూడు నెలల వయస్సు గల చిన్నారి తల లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన పోలీసులు దర్యాప్తు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు.

ఇంటి యజమానే ప్రధాన నిందితుడు
రాజశేఖర్ చర్యలు అనుమానాస్పదంగా ఉండడంతో ఆ దిశగా పోలీసులు దృష్టి పెట్టి దర్యాప్తు సాగించారు. ఆయన ఇంట్లో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయని పోలసులు తెలిపారు.

కారులో కూడా క్షుద్రపూజల సరుకులు
కారులో కూడా పూజలకు సంబంధించిన వస్తువులు లభించాయి. దీంతో రాజశేఖర్ క్షుద్రపూజలు చేయించినట్లు పోలీసులు అనుమానించి దర్యాప్తు చేశారు. భార్య అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె బాగు కోసం రాజశేఖర్ నరబలి ఇచ్చినట్లు చెబుతున్నారు.

చంద్రగ్రహణం రోజు బలి ఇస్తే..
చంద్రగ్రహణం రోజు నరబలి ఇస్తే భార్య శ్రీలత ఆరోగ్యం మెరుగుపడుతుందని పూజారి సలహా ఇవ్వడంతో రాజశేఖర్ నరబలికి పూనుకున్నాడు. పసికందును బలి ఇవ్వడానికి కరీంనగర్ జిల్లాలోని తండా నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. తలను ఇంటిపై వేసిన వ్యక్తి పసికందు మొండాన్ని ఎక్కడ వేశాడనేది తెలియలేదు.

ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
శిశువును విక్రయించినవారిని పట్టుకునేందుకు పోలీసులు కరీంనగర్ వెళ్లినట్లు తెలుస్తోంది. రాజశేఖర్‌తో పాటు పూజారిని, ఇద్దరు బ్రోకర్లను అరెస్టు చేశారు. రాజశేఖర్ పెద్ద కుమారుడు రంజిత్‌ు కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications