భర్త టార్చర్ భరించలేక: ఇద్దరు భార్యలు కలిసి గొడ్డలితో!..

భర్త పెట్టే హింసను భరించలేక భార్యలు ఇద్దరు కలిసి అతన్ని హత్య చేశారు.

పెద్దపల్లి: సంసారం అన్నాక.. భార్యభర్తల మధ్య మనస్పర్థలు, విభేదాలు చాలా కామన్. ఇద్దరిలో ఎవరో ఒకరు పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించకపోతే జీవితం ముందుకు సాగదు. సహజంగానే ఇలాంటి సందర్బాల్లో ఎక్కువ శాతం ఆడవాళ్లే అనుకువగా వ్యవహరిస్తారు. అయితే వారి సహనాన్ని ఆసరాగా తీసుకుని అదే పనిగా వేధింపులకు పాల్పడితే ఏదో రోజు తిరగబడక తప్పదు. ఈ క్రమంలో హత్యలు సైతం చోటు చేసుకుంటుండం విషాదం.

తాజాగా పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ లోను ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తిరుమలయ్య(65) అనే రిటైర్డ్ సింగరేణి కార్మికుడు తన ఇద్దరు భార్యలను నిత్యం వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. భర్త పెట్టే హింసను భరించలేక భార్యలు ఇద్దరు కలిసి అతన్ని హత్య చేశారు.

husband brutal murder in peddapalli district

బుధవారం రాత్రి తిరుమలయ్య నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో అతనిపై దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతుండగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+