పైశాచికం: రెండో పెళ్లి కోసం భార్య మర్మాంగాలపై జీడి..
మెదక్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఓ భర్త... భార్యపట్ల దారుణంగా ప్రవర్తించాడు. మృగంగా మారిన అతను తన భార్య మర్మాంగాల పైన జీడి పోసి కాల్చి, తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి సమీపంలోని కంది గ్రామంలో ఈ ఘోరం జరిగింది.
సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటకు చెందిన మహిళకు కంది నివాసి అయిన వ్యక్తితో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురు ఆడపిల్లలు, ఒకతను అబ్బాయి.

తన మర్మాంగాల పైన భర్త జీడీ పోశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
కాగా, భార్యను వదిలించుకొని మరో పెళ్లి చేసుకోవడానికి ఆ దుర్మార్గ భర్త ప్రయత్నిస్తున్నాడు. భార్య అందుకు అంగీకరించకపోవడంతో జీడిపోసి కాల్చాడని తెలుస్తోంది. ఇందుకోసం చాలా రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. తన భర్త తనను వదిలేస్తే తనకు, తన పిల్లలకు న్యాయం ఎలా జరుగుతుందని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.












Click it and Unblock the Notifications