శారీరక సంబంధాలు, శిరీషపై ఎస్ఐ అత్యాచారయత్నం: ఇది సిపి మాట

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య చేసుకొందని హైద్రాబాద్ సిపీ మహేందర్ రెడ్డి చెప్పారు. అయితే కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన తర్వాత ఆమె స్టూడియోలోనే ఆత్మహత్య చేసుకొందన్నారు. శిరీష పట్ల కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నిందితులుగా రాజీవ్ , శ్రవణ్ లను అరెస్టు చేసినట్టు చెప్పారు.

బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఎస్ ఐ ఆత్మహత్యల కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో అన్ని కోణాల్లో కేసును చేధించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసును టెక్నికల్ గా పరిశోధించినట్టు చెప్పారు. బ్యూటీషీయన్ శిరీష, రాజీవ్ కు మధ్య విబేధాలను పరిష్కరించుకొనే నేపథ్యంలోనే కుకునూరుపల్లికి వెళ్ళాడని విచారణలో తేలింది. ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి దేవరకొండ ప్రోబేషనరీ ఎస్ ఐ గా పనిచేసిన సమయం నుండి శ్రవణ్ తో పరిచయం ఉంది.

అయితే ఈ కేసులో శ్రవణ్ తీరు పట్ల పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రవణ్ వ్యక్తిత్వం కూడ మంచిదికాదన్నారు. ఈ మేరకు గత చరిత్రను కూడ పరిశీలించినప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చాయన్నారు.

తేజస్విని తెలిసిందని

తేజస్విని తెలిసిందని

బ్యూటీషీయన్ శిరీష రాజీవ్ వద్ద నాలుగేళ్ళుగా పనిచేస్తోంది. అంతకుముందు ఆమె బ్యూటీ పార్లర్ నిర్వహించేది.అయితే బ్యూటీ పార్లర్ సక్రమంగా నడవకపోవడంతో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయంతో శిరీష రాజీవ్ వద్ద నాలుగేళ్ళుగా పనిచేస్తోంది. అయితే వారిద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.అయితే ఈ వివాహేతర సంబంధాన్ని శిరీషతో కొనసాగించాలని రాజీవ్ భావించాడు. అయితే అనుకోకుండా ఫేస్ బుక్ లో బెంగుళూరుకు చెందిన టెక్కీ తేజస్వీనితో పరిచయమైంది. తేజస్వినితో మూడేళ్ళుగా అయనకు పరిచయముంది. అయితే ఏడాది క్రితం తేజస్విని హైద్రాబాద్ కు వచ్చింది. ఆ సమయంలో తేజస్వినితో రాజీవ్ తో తేజస్వినితో శారీరక సంబంధం ఏర్పడింది. అయితే తేజస్విని వివాహం చేసుకోవాలనుకొన్నాడు రాజీవ్. అయితే శిరీషతో రాజీవ్ కు ఉన్న వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలిసి తేజస్విని రాజీవ్ తో గొడవకు దిగింది.

 ఈ గొడవ పరిష్కారం కోసం

ఈ గొడవ పరిష్కారం కోసం

తేజస్విని, శిరీష మధ్య గొడవ ముదిరింది. రాజీవ్ ను పెళ్ళిచేసుకోవాలని భావించిన తేజస్విని శిరీషతో ఉన్న వివాహేతర సంబంధాన్ని తేల్చుకోవాలని తేజస్విని భావించింది. దీంతో మే 30వ, తేదిన తేజస్విని స్టూడియోకు వచ్చి శిరీషతో గొడవ పెట్టుకొంది. అయితే ఈ విషయమై గొడవ పెద్దది కావడంతో రాజీవ్ 100 నెంబర్ కు ఫోన్ చేశారు. అయితే బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురికి కౌన్సిలింగ్ ఇచ్చిపంపారు. అయితే రెండురోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ వస్తానని తేజస్విని బంజారాహిల్స్ పోలీసులకు చెప్పింది.

రంగంలోకి శ్రవణ్

రంగంలోకి శ్రవణ్

తేజస్విని, శిరీషలతో పాటు తనకు మధ్య ఉన్న గొడవను పరిష్కరించుకోవాలని రాజీవ్ భావించాడు.ఈ మేరకు తన స్నేహితుడు శ్రవణ్ ను ఈ విషయమై
సంప్రదించాడు. శ్రవణ్ తో శిరీషకు కూడ పరిచయముంది.అయితే ఈ విషయాన్ని రాజీవ్ శ్రవణ్ వద్ద ప్రస్తావించిన సమయంలో తనకు పరిచయమున్న కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి సహయం తీసుకోవాలని శ్రవణ్ సూచించాడు.ఈ మేరకు శ్రవణ్ కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డికి విషయం చెప్పాడు.దీంతో బంజారాహిల్స్ ఎస్ ఐ హరీందర్ కు విషయాన్ని చెప్పి తేజస్విని, శిరీష, రాజీవ్ ల మధ్య గొడవను పరిష్కరించాలని సూచించారు. అయితే ఈ నెల 13న,ఈ మేరకు బంజారాహిల్స్ ఎస్ ఐ హరీందర్ ను కలిశారు రాజీవ్, శ్రవణ్, శిరీష.అయితే ఆ సమయంలో హరీందర్ బిజీగా ఉన్నానని చెప్పారు. వారం రోజుల తర్వాత రావాలని సూచించారు.

కుకునూర్ పల్లికి ఎందుకు వెళ్ళారంటే ?

కుకునూర్ పల్లికి ఎందుకు వెళ్ళారంటే ?

అయితే వారం రోజుల తర్వాత రావాలని హరీందర్ సూచించడంతో కుకునూర్ పల్లికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతోందని శ్రవణ్ సూచించారు.దీంతో శిరీష, రాజీవ్,శ్రవణ్ లు కుకునూర్ పల్లికి ఈ నెల 13వ, తేది రాత్రి బయలుదేరారు. రాత్రి పదకొండున్నర గంటలకు కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ కు వారు చేరుకొన్నారని పోలీసులు చెప్పారు. అయితే వారు కుకునూర్ పల్లికి బయలుదేరే ముందు మార్గమధ్యలో విస్కీ, స్నాక్స్ తీసుకొన్నారని చెప్పారు. అయితే కుకునూర్ పల్లిలోని ఎస్ ఐ క్వార్టర్ లో మద్యం తాగి ఈ విషయమై చర్చించుకొన్నారని విచారణలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.

 శిరీషపై ఎస్ ఐ ప్రభాకర్ రె్డ్డి అసభ్య ప్రవర్తన

శిరీషపై ఎస్ ఐ ప్రభాకర్ రె్డ్డి అసభ్య ప్రవర్తన

మద్యం మత్తులో కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో శిరీష తాను అలాంటి దాన్ని కాదని ఆమె ప్రాధేయపడ్డారు. శిరీష భయంతో కేకలు వేయడంతో సిగరెట్టు తాగేందుకు పోలీస్ క్వార్టర్ నుండి బయటకు వచ్చిన రాజీవ్, శ్రవణ్ లు వెంటనే క్వార్టర్ లోకి వెళ్ళారు. అయితే ఆ సమయంలో శిరీష భయంతో ఓ మూలన నక్కి ఉందని నిందితులు చెప్పారని పోలీసులు చెబుతున్నారు. సమస్య పరిష్కారం వచ్చి ఈ రకంగా చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు.

శిరీషపై రాజీవ్ దాడి

శిరీషపై రాజీవ్ దాడి

ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి అసభ్య ప్రవర్తనతో భయంకరంగా అరుస్తున్న శిరీషపై రాజీవ్ దాడి చేశారు. గట్టిగా అరుస్తుండంతో తన పరువు పోతోందనే భయంతో ప్రభాకర్ రెడ్డి అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలని ప్రభాకర్ రెడ్డి వారిని కోరారు. అయితే ఎస్ ఐ అసభ్యప్రవర్తన చేయడానికి ముందే ఎస్ ఐ తో రాజీవ్, శ్రవణ్ ల మాటలను విన్న శిరీష తన లోకేషన్ ను వాట్సాప్ లో భర్తకు షేర్ చేసిందని సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. అయితే ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం తో కారులో హైద్రాబాద్ కు తిరిగివస్తున్న సమయంలోనే కారుదిగేందుకు శిరీష ప్రయత్నించింది.ఈ సమయంలో రాజీవ్ మరోసారి ఆమెపై దాడికి దిగాడని సిపీ చెప్పారు.స్టూడియోకు వచ్చిన తర్వాత ఆమె స్టూడియోలోనే ఆత్మహత్య చేసుకొందన్నారు.

విచారణ వివరాలు తెలుసుకొన్న ప్రభాకర్ రెడ్డి

విచారణ వివరాలు తెలుసుకొన్న ప్రభాకర్ రెడ్డి

ఈ కేసు విచారణ వివరాలను బంజారాహిల్స్ ఎస్ ఐ హరీందర్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొన్నాడని చెప్పారు. అయితే ఆత్మహత్య చేసుకొన్న రోజు ఉదయం కూడ ప్రభాకర్ రెడ్డి హారీందర్ తో మాట్లాడారని చెప్పారు.అయితే ఆ సమయంలో మీ క్వార్టర్ లోనే అందరూ మద్యం తాగారని నిందితులు చెప్పారని హరీందర్ ప్రభాకర్ రెడ్డితో అనగానే, అందరూ మద్యం తాగలేదు. తాను శ్రవణ్ మాత్రమే మద్యం తాగమని చెప్పి ప్రభాకర్ రెడ్డి ఫోన్ కట్ చేశారని చెప్పారు.ఈ ఫోన్ చివరి ఫోన్ కాల్ అని మహేందర్ రెడ్డి చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderababad city police commissioner Mahdendar Reddy reveled Sirisha suicide case on Friday. how to sirisha suicide explained to media.
Please Wait while comments are loading...