చల్లని కబురు: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్, జిల్లాల వాసులకూ సూచనలు

హైదరాబాద్: నగర ప్రజలకు ఇది నిజంగా చల్లని కబురే. ఎందుకంటే, హైదరాబాద్ నగర పరిధిలో ఏప్రిల్ 27వ తేదీ వరకు అంటే వచ్చే గురువారం వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. అంతేగాక, హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న వర్షాలతో ఎండవేడిమితో అల్లాడిపోతున్న నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది.

వాతావరణ శాఖ హైదరాబాద్ ప్రకారం.. హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లు - చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో.. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

Hyderabad and other telangana districts to receive rainfall till Thursday, forecast IMD

హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని అంచనా వేయగా.. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) సూచనకు అనుగుణంగా ఉంది. రాబోయే మూడు రోజులలో సాయంత్రం/రాత్రి వేళల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులను కూడా అంచనా వేసింది.

హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ హైదరాబాద్‌కే పరిమితం కాదని, తెలంగాణ రాష్ట్రమంతటికీ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌కు వెళ్లవచ్చని.. దీని వలన ప్రజలు ఇంట్లోనే ఉండి తమను తాము హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యమని వాతావరణ శాఖ సూచించింది. వాతావరణ శాఖ హైదరాబాద్, TSDPS సూచనల దృష్ట్యా.. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

వేడిని అధిగమించడానికి చిట్కాలు:

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్న క్రమంలో.. వేడిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

హైడ్రేటెడ్ గా ఉండండి :
హైడ్రేటెడ్‌గా ఉండటానికి, పుచ్చకాయ, తాజా పండ్లు మొదలైనవి తీసుకోవచ్చు. నిమ్మరసం, లస్సీ, పెరుగు మొదలైనవి కూడా తీసుకోవచ్చు.

స్పైసీ ఫుడ్ మానుకోండి:
స్పైసీ ఫుడ్ మానేయడం చాలా అవసరం, ఎందుకంటే ఇది శరీరంలో జీవక్రియను పెంచుతుంది.

అధిక డ్రై ఫ్రూట్స్‌కు 'నో' చెప్పండి:
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు మొదలైన వాటిని ఎక్కువగా తీసుకోవడం మానేయాలి, ఎందుకంటే అవి శరీరంలో విపరీతమైన వేడిని ఉత్పత్తి చేస్తాయి.

వేసవిలో డీప్ ఫ్రైడ్ ఫుడ్ మంచిది కాదు:
వేసవిలో డీప్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది, కడుపులో మంట వస్తుంది.

పీక్ టైమ్‌లో బయటకు వెళ్లడం, వంట చేయడం మానుకోండి:
పీక్ టైమ్‌గా పరిగణించబడే మధ్యాహ్నం 12, 3 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోండి. ఆ సమయంలో వంట చేయడం వల్ల కూడా ఎక్కువగా వేడికి గురవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+