కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్: పాక్ ఉగ్రవాదుల పనే!
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్‌కు గురైంది. ఈ మేరకు ఆయన సోమవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. 'కిషన్‌రెడ్డి డాట్ కామ్' అనే తన వెబ్‌సైట్ సోమవారం ఉదయం నుంచి హ్యాక్ అయిందని డీజీపీకి తెలిపారు.

పాకిస్థానీయులే ఈ పనిచేసి ఉంటారని తాను అనుమానిస్తున్నట్లు తెలిపారు.
గత పదేళ్లుగా తాను ఈ వెబ్‌సైట్‌ను నిర్వహించుకుంటున్నానని, తన దగ్గర పనిచేసే ఉద్యోగులు దానిని అప్‌డేట్ చేస్తుంటారని చెప్పారు.
ఎప్పటికప్పుడు తాను నిర్వహించే కార్యక్రమాలను, సేవలను రోజువారిగా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తుంటారని చెప్పారు. సోమవారం ఉదయం తన ఉద్యోగి ఓ వార్తను అప్‌డేట్ చేసేందుకు ప్రయత్నించగా హ్యాకింగ్ గురైనట్లు గుర్తించామని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందినవారు, కరడుగట్టిన దేశ ద్రోహులే ఈ పనిచేసి ఉంటారని తాను భావిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications