చిన్నారితో సహా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారితో సహా దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని శనివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన స్ధానికులు చిన్నారని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. చిన్నారి పరిస్ధితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థిని సమీక్షిస్తున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతేదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలకారణంగానే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా దంపతులిద్దరి మధ్య సరైన ఒద్దిక లేకపోవడం వల్ల తరుచూ ఇద్దరూ గొడవ పడుతున్నట్లు తెలిసింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications