ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎన్ని ఓట్లు పోలయ్యాయంటే?

హైదరాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మొత్తం పోలింగ్ శాతం 75.57గా నమోదైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా బీఆర్ఎస్​ పార్టీ మాత్రం ఓటింగ్‌​కు దూరంగా ఉంది.
మొత్తం 112 ఓట్లలో 88 ఓట్లు పోలయ్యాయి.

హైదరాబాద్​ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. సుమారు 250 మంది పోలీసులతో బందోబస్తులో పాల్గొన్నారు.

Hyderabad local body MLC elections concluded peacefully

బ్యాలెట్ పద్ధతిలో జరగిన ఈ పోలింగ్‌కు ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం ఒక పోలింగ్ కేంద్రం, కార్పొరేటర్లకు మరో కేంద్రం ఏర్పాటు చేశారు. 500 పోలింగ్ కేంద్రంలో ఓ మైక్రో అబ్జర్వర్‌తో పాటు, ఓ కౌంటింగ్ సూపర్ వైజర్, 2 సహాయకులతో ఓ టీమ్​ను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక కోసం 250 మంది పోలీసుల బందోబస్తుతో పాటు మొత్తం 500 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.

దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ ఎన్నిక జరగడం గమనార్హం. ఈ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఈ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమవుతుంది. అధికార యంత్రాంగం ఇప్పటికే లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది.

ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పాల్గొనడం, ఓటింగ్ శాతం 78.57కి చేరడం, ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య విజయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, ఏప్రిల్ 25న వెలువడే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+