బీ అలెర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు పొట్టు పొట్టు వర్షాలు

హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతాయని పేర్కొంది. అంతేకాక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అంచనా వేసింది.

తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. అలాగే ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. కుమురం భీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు పడుతున్నాయని తెలిపింది. అరేబియన్ సముద్ర తీర ప్రాంతం నుంచి ద్రోణి దక్షిణ గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. మరోవైపు ఈ ఏడాది మధ్య భారతదేశం, చాలా ఉత్తర రాష్ట్రాలను రుతుపవనాలు వేగంగా వ్యాప్తి చెందాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Hyderabad Met Dept Heavy Rains to Lash Telangana for Next Three Days

భారత వాతావరణ కేంద్రం(IMD) తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్, హరియాణా, దిల్లీ, ఉత్తర ప్రదేశ్‌ లోని కొన్ని ప్రాంతాలు తప్పించి భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకున్నట్లు తెలిపింది. వాయువ్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరిస్తూనే ఉన్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు చేరుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+