బిగ్ షాక్.. హైదరాబాద్ లో మెట్రో సేవలు బంద్..? చేతులెత్తేసిన L&T
హైదరాబాద్ మెట్రోలో నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారు. స్కూళ్లు, కాలేజీలకు, ఆఫీసులకు ఇతర పనుల కోసం మెట్రోనే ఆశ్రయిస్తారు నగరవాసులు. భాగ్యనగరంలో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ కారణంగా సొంత వాహనాలు, బస్సులు, ఆటోల్లో సమయం వృథా అవుతుందన్న కారణంతో వేలాది మంది భాగ్యనగరం ప్రజలు మెట్రో రైలులోనే ప్రయాణిస్తుంటారు. అయితే తాజాగా నగరవాసులకు బిగ్ షాక్ తగిలేలా ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణపై L&T చేతులెత్తేసింది. ఇక తమ వల్ల కాదంటూ ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది.
హైదరాబాద్ లో మెట్రో నిలిచిపోనుందా..? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో మరోసారి కష్టాల్లో పడింది. భారీ నష్టాల దృష్ట్యా మెట్రోని నడిపించడం తమ వల్ల కాదంటూ ఎల్ అండ్ టీ సంస్థ చేతులెత్తేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. బాకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక భారం పెరిగిపోయిందని లేఖలో వివరించింది. మెట్రోకు ఇప్పటికే రూ. 2,500 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించాలంటూ లేఖలు రాసినా ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదని ఎల్ అండ్ టీ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో హైదరాబాద్ లో మెట్రో రైళ్ల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

ప్రస్తుతం మెట్రో ఫేజ్-2 దశను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది. అయితే మొదటి దశను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని ఎల్ అండ్ టీ లేఖ రాసింది. మెట్రో రైలు ప్రాజెక్ట్ ను నడపడం తమ వల్ల కాదంటూ లేఖలో పేర్కొంది. అప్పులు, అధిక వడ్డీలను బరించలేకపోతున్నామంటూ తెలిపింది. ఇక హైదరాబాద్ లో మెట్రో సేవలు నిలిచిపోతే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం ఉంది.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం మెట్రో నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ సంస్థతో మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో 2017లో మెట్రో నిర్మాణం పూర్తి అయి రాకపోకలు ప్రారంభమయ్యాయి. మెట్రో రాకతో ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరాయి. ప్రయాణం కూడా సులువుగా మారింది.












Click it and Unblock the Notifications