గుప్తనిధులు: సోదరుడి హత్య, సిమ్ కార్డుతో వీడిన మిస్టరీ

హైదరాబాద్: అప్పు రూపంలో తీసుకున్న డబ్బుని తిరిగి చెల్లించడం ఇష్టం లేని ఓ దుర్మార్గుడు బాబాయ్ కొడుకుని అత్యంత దారుణంగా బండరాళ్లతో మోది చంపేశాడు. జనవరి 31న ఎస్ఆర్‌నగర్‌లో అదృశ్యమైన సంతోష్‌రెడ్డి కేసుకు సంబంధించి ఇంత కాలం నెలకొన్న మిస్టరీని పోలీసులు బుధవారం చేధించారు.

కేసు వివరాలను పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర్‌రావు వెల్లడించారు. మెదక్‌ జిల్లా మునిపల్లి మండలం మన్‌సానిలం గ్రామానికి చెందిన చిన్నోళ్ల మాణిక్యరెడ్డి గత కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతడి బాబాయ్‌ నర్సింహారెడ్డి కుమారుడైన సంతోష్‌రెడ్డి(28) కూడా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ మధురానగర్‌లో నివాసం ఉంటున్నాడు.

మహారాష్ట్రలో గుప్త నిధులున్నాయని, వాటి తవ్వకానికి రెండు లక్షలు పెట్టుబడిగా పెడితే 15 రోజుల్లో రూ.15 లక్షలు లాభం ఇస్తానని సంతోష్‌రెడ్డితో మాణిక్యరెడ్డి నమ్మించాడు. మాణిక్యరెడ్డి మాటలు నమ్మిన సంతోష్‌రెడ్డి అతడికి రూ. లక్షా యాభై వేలు ఇచ్చాడు. అప్పుగా తీసుకున్న నగదు, లాభం ఇవ్వకపోవడంతో సంతోష్‌రెడ్డి మాణిక్యరెడ్డిపై ఒత్తిడి తెచ్చాడు.

గుప్తనిధులు నాగ్‌పూర్‌లో తన స్నేహితులు శైలేష్‌, పాదం వద్ద ఉన్నాయని, వాటిని చూపిస్తానని చెప్పి జనవరి 28న సంతోష్‌రెడ్డిని మాణిక్యరెడ్డి నాగ్‌పూర్‌ తీసుకెళ్లాడు. అయితే అక్కడ వాటిని చూపించకుండా తిరిగి వెనక్కి తీసుకొచ్చాడు. ఆ తర్వాత తన స్నేహితులే గుప్తనిధులను నగరానికి తీసుకొస్తారని నమ్మించాడు.

జనవరి 30న శైలేష్‌, పాదంలను నగరానికి రప్పించిన మాణిక్యరెడ్డి వారికి మియాపూర్‌ సుప్రజ లాడ్జిలో బస ఏర్పాటు చేశాడు. లాజ్డిలోనే ముగ్గూరు కలిసి సంతోష్ రెడ్డి హత్యకు పథకం వేశారు. జనవరి 31న మాణిక్యరెడ్డి సంతోష్‌రెడ్డికి ఫోన్ చేసి మియాపూర్‌ రమ్మన్నాడు. ఒక బైక్‌పై మాణిక్యరెడ్డి, సంతోష్‌రెడ్డి వచ్చారు.

గుప్తునిధులు చూపిస్తామని చెప్పి మరో బైక్‌పై శైలేష్‌, పాదంలు నర్సాపూర్‌ వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ షాపులో మద్యం బాటిళ్లను కొన్నారు. అనంతరం నర్సాపూర్‌ వెళ్లేదారిలో మేడాలమ్మ గుడి వద్ద బైక్‌లను పార్క్‌ చేసి గుప్తనిధుల గురించి మట్లాడుకుందామని అడవిలోకి వెళ్లారు.

 Hyderabad police break a case through memory card

అక్కడ చెట్టుకింద కూర్చొని నలుగురూ మద్యం తాగారు. సంతోష్‌రెడ్డి మధ్యాహ్నం 3.30 గంటలకు మత్తులోకి జారుకోగానే బండరాళ్లతో అతడి తలపై మోది చంపేశారు. అనంతరం అతడి దుస్తులను విప్పి, మృతదేహాన్ని 5 కిలోమీటర్ల మేర అడవిలోకి ఈడ్చుకెళ్లారు. మాణిక్యరెడ్డి వాటిపై పెట్రోల్‌ పోసి కాల్చేశాడు.

తిరిగి ఏమీ తెలియనట్లు హైదరాబాద్‌కు వచ్చి సంతోష్‌రెడ్డి రెండు సెల్‌ఫోన్లను మియాపూర్‌లోగల నాలాలో పడేశాడు. అంతక ముందు పనిమీద వేరే చోటికి వెళ్తున్నానంటూ కొద్ది రోజుల్లో ఇంటికి వస్తానంటూ మృతుడి సెల్ ఫోన్ నుంచి అతడి కుటుంబ సభ్యులకు మాణిక్యరెడ్డి ఎస్‌ఎంఎస్‌ పంపించాడు.

అనంతరం బాబాయ్‌ నర్సింహరెడ్డి ఇంటికి వచ్చి సంతోష్‌రెడ్డి వ్యవహారం ఏమీ తెలియనట్లు నటించాడు. తన కుమారుడు సంతోష్‌రెడ్డి కనబడటం లేదని తండ్రి నర్సింహరెడ్డి ఫిబ్రవరి 10వ తేదీన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్రైం నెం. 89/2016 ప్రకారం మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

సంతోష్ రెడ్డి కాల్ డేటాను పరిశీలించారు. మృతుడు చనిపోవడానికి ముందు మాణిక్యరెడ్డితో పలుమార్లు మాట్లాడినట్టు ఉంది. దీంతో పోలీసులు అతడిపై నిఘా ఉంచారు. సంతోష్‌రెడ్డి హత్య కేసును చేధించడంలో అతడి మెమొరీ కార్డు క్లూ ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.

మాణిక్యరెడ్డితో ఫోన్‌లో మాట్లాడినప్పుడు ప్రతిసారి ఆ సంభాషణను సంతోష్‌రెడ్డి రికార్డు చేసి మెమొరీ కార్డులో స్టోర్‌ చేశాడు. కార్డును ఫోన్‌ నుంచి తీసి ఇంట్లోనే దాచాడు. సంతోష్‌రెడ్డి కుటుంబ సభ్యులు దాన్ని గుర్తించారు. ఫోన్‌లో వేసి రికార్డింగ్‌ విన్నారు. మెమొరీ కార్డును సంతోష్‌రెడ్డి కుటుంబసభ్యులు పోలీసులకు అందజేయడంతో అతడి హత్య కేసు మిస్టరీ వీడింది.

దీంతో పోలీసులు మాణిక్యరెడ్డిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించగా సంతోష్‌రెడ్డిని తానే హత్య చేసినట్టు మాణిక్యరెడ్డి అంగీకరించాడు. ఈ హత్య కేసులో మాణిక్యరెడ్డికి సహకరించిన మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని డీసీపీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+