హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీగా హైదరాబాద్ ఎన్ఐఏబీ: ఇక్కడే కరోనా వ్యాక్సిన్ నాణ్యతా పరీక్షలు, పీఎంకేర్ ఫండ్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లను పరీక్షించి, అనుమతులు జారీ చేసేందుకు కేంద్రం మరో సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబొరేటరీ (సీడీఎల్‌) ఏర్పాటు చేసింది. ఈ మేరకు అధికారులు సోమవారం ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయో టెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)ని సీడీఎల్‌గా ఎంపిక చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీగా ఎన్ఐఏబీ..

సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీగా ఎన్ఐఏబీ..


సీడీఎల్‌గా మార్చగల సాంకేతిక ఉన్న ల్యాబొరేటరీని ఎంపిక చేయాలని గత నవంబర్‌లో కేబినెట్‌ సెక్రటరీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రెండు ల్యాబొరేటరీలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ) కేంద్రానికి సూచించింది. అందులో పుణేకు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్సెస్‌ (ఎన్‌సీసీఎస్‌), హైదరాబాద్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయో టెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)లు ఉన్నాయి. ఇందులో ఎన్‌సీసీఎస్‌ను ఈ ఏడాది జూన్‌ 28న సీడీఎల్‌గా ప్రకటించగా, తాజాగా హైదరాబాద్ ఎన్‌ఐఏబీని సీడీఎల్‌గా ప్రకటించారు.

పీఎం కేర్ నుంచి సీడీఎల్‌కు ఫండ్స్..

పీఎం కేర్ నుంచి సీడీఎల్‌కు ఫండ్స్..

ఈ సీడీఎల్‌లకు పీఎం కేర్స్‌ నుంచి నిధులు అందుతాయి. తయారైన ప్రతీ బ్యాచ్‌ వ్యాక్సిన్‌ను ఈ కేంద్రాల్లో పరీక్షించి, ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తగినన్ని పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో వ్యాక్సిన్‌ బ్యాచ్‌లను విడుదల చేయడంలో ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొత్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

ఇది ఇలా ఉండగా, తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా త్తగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 405 మందికి కోవిడ్ పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,52,785కి చేరుకుంది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

కరోనా వైరస్ వైరస్ మహమ్మారి బారినపడిన వారిలో 577 మంది కోలుకున్నారు. ఈ వైరస్ ధాటికి కొత్తగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం కరోనా ధాటికి తాళలేక మరణించిన వారి సంఖ్య 3,845కు చేరింది. అయితే, సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కోలుకుని మొత్తం 6,41,847 మంది ఇళ్లకు చేరుకున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7,093 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 84,262 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. దీంతో మొత్తంగా 2,34,78,940 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 04, భద్రాద్రి కొత్తగూడెంలో 08, జీహెచ్ఎంసీలో 67. జగిత్యాలలో 18, జనగామలో 07, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 04, కామారెడ్డిలో 03, కరీంనగర్ లో 32, ఖమ్మంలో 22, కొమురంభీం ఆసిఫాబాద్ లో 04, మహబూబ్‌నగర్‌లో 04, మహబూబాబాద్‌లో 07, మంచిర్యాలలో 12, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 24, ములుగులో 06, నాగర్ కర్నూలులో 05, నల్గొండలో 24, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 07, పెద్దపల్లిలో 21, రాజన్న సిరిసిల్లలో 15, రంగారెడ్డిలో 19, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 10, సూర్యాపేటలో 17, వికారాబాద్ లో 05, వనపర్తిలో 03, వరంగల్ రూరల్ లో 11, వరంగల్ అర్బన్‌లో 36, యాదాద్రి భువనగిరిలో 05 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

English summary
Hyderabad’s NIAB authorized as central lab for Coronavirus vaccines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X