హైదరాబాద్ TO చార్‌ధామ్ యాత్ర... తక్కువ ధరకే IRCTC ప్రత్యేక ప్యాకేజీ
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే యాత్రల్లో చార్ ధామ్ యాత్ర ఒకటి. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వెళ్తుంటారు. ఉత్తరాఖండ్ లోని హిమాలయ పర్వతాల్లో నెలకొని ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ లను దర్శించే పవిత్ర తీర్థయాత్రనే చార్ ధామ్ యాత్ర అని పేర్కొంటారు. అయితే హైదరాబాద్ నుంచి చార్ ధామ్ యాత్ర వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్ అందింది. IRCTC టూరిజం తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం తక్కువ ధరకే ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో ఒకటి 'చార్ ధామ్ యాత్ర'. ప్రతి హిందువు ఈ యాత్రను తమ జీవితంలో ఒకసారైనా చేయాలని అనుకుంటారు. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ ధామ్ లను దర్శించుకుని తరిస్తుంటారు. అలాంటి వారికోసం IRCTC శుభవార్త తెలిపింది. చార్ ధామ్ యాత్రికుల కోసం తక్కువ ధరకే స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ 10 రాత్రులు, 11 రోజుల టూర్ ప్యాకేజీ.
ఈ చార్ ధామ్ టూర్ 2026 మే 17న ప్రారంభం కానుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులు మొదటగా హైదరాబాద్ నుండి డెహ్రాడూన్ విమానంలో ప్రయాణిస్తారు. మొదటిరోజు ఉదయం 08:45 గంటలకు విమానం స్టార్ట్ అవుతుంది. 11:15 గంటలకు డెహ్రడూన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హిమాలయాల మీదుగా రోడ్డు ప్రయాణం ఉంటుంది. అక్కడ విశ్రాంతి తర్వాత జాంకీ చట్టి చేరుతారు. అక్కడి నుంచి యమునోత్రి ఆలయానికి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు.
యుమునోత్రి దర్శనం తర్వాత ఉత్తరకాశీకి బయల్దేరతారు. అక్కడ కాశీ విశ్వనాథ్ ఆలయం దర్శనం ఆ తర్వాత గంగోత్రి ఆలయానికి చేరుతారు. ఇక్కడి నుంచి కేదార్ నాథ్ ఆలయానికి బయలుదేరతారు. సాయంత్రం హారతి, ఉదయం అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత బద్రినాథ్ ఆలయం దర్శనం ఉంటుంది. అలా చార్ ధామ్ యాత్ర పూర్తి చేసిన తర్వాత హరిద్వార్ చేరి గంగా హారతి దర్శనం చేసుకుంటారు.

అలా ఇక సాయంత్రం 5:45 గంటలకు డెహ్రాడూన్ నుండి బయల్దేరితే రాత్రి 8:15 కు హైదరాబాద్ చేరుకుంటారు. దాంతో టూర్ ముగుస్తుంది. టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.74,430 అలాగే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.79,440 ఉంటుంది. ఇక సింగిల్ ఆక్యుపెన్సీకి అయితే రూ.91,610 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications