Video: హైదరాబాద్ నాలాలో పడి బాలుడు మృతి ఘటన: మిథున్ మరణానికి వీళ్లిద్దరే బాధ్యులు
హైదరాబాద్: గత రెండ్రోజుల క్రితం నగరంలోని బాచుపల్లి ప్రగతినగర్ ఎన్నారై కాలనీ నాలాలో పడి గల్లంతై నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన విషయం విధితమే. అయితే, మిథున్ మరణానికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
భారీ వర్షాలతో వరదనీరు రావడంతో.. దాన్ని నాలాలోకి పంపించిన ఇద్దరు వ్యక్తులు.. మళ్లీ మూత వేయకపోవడంతో ఈ విషాద ఘటన జరిగినట్లు వీడియో స్పష్టం చేస్తోంది. వారి నిర్లక్ష్యం వల్లే మిథున్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సూర్యపేటకు చెందిన సంతోష్ రెడ్డి ఐదేళ్ల క్రితం ప్రగతినగర్ వచ్చి ఎన్నారై నివాసముంటూ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. సంతోష్ రెడ్డి రెండో కుమారుడు మిథున్.. మంగళవారం ఉదయం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే, అక్కడ మూత లేని మ్యాన్ హోల్‌లో పడి గల్లంతయ్యాడు.
Who is responsible for 4 yr old Mithun Reddy's death in Pragathi Nagar, #Hyderabad?
— Surya Reddy (@jsuryareddy) September 7, 2023
In #CCTV a man, alleged NRI Colony welfare association President and watchman opened the manhole cover at 08.2am and Mithun fell into the manhole at 11am.
Police investigating said @BachupallyS . https://t.co/JQqzcSeejE pic.twitter.com/jIrxn8mNvV
బాలుడి కోసం స్థానికులు గాలించినా ఫలితం లేకపోయింది. బాచుపల్లి నాలా కలిసే ప్రగతినగర్ తుర్క చెరువులో డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టగా మిథున్ మృతదేహం లభ్యమైంది. బాలుడు నాలాలో పడిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వరద నీరు ఉండటంతో అక్కడ నాలా మూత తీసుందనే విషయం కూడా ఎవరికీ తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఓ వ్యక్తి వెనక వెళ్లిన బాలుడు నాలాలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
అయితే, బాలుడు మరణించడానికి ఎన్నారై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి, వాచ్‌మ్యాన్ కారణమని తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో స్పష్టమవుతోంది. వరదనీరు వెళ్లేందుకు నాలా మూత తీయించిన కాలనీ ప్రతినిధి.. ఆ తర్వాత మూసివేయకుండా వదిలేశారు. దీంతో బాలుడు నాలాలో పడి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు, నెటిజన్లు సదరు ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications