హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిలో కొత్త మార్పులు.. త్వరలోనే టెండర్లు..!

తెలంగాణలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రాష్ట్రంలోని రహదారులను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మంగళవారం దిల్లీలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

హైదరాబాద్- విజయవాడ నాలుగు వరుసల రహదారిని 6 వరుసలుగా నిర్మించాలని, అదనంగా సర్వీస్ రోడ్డును రెండు వరుసలకు పెంచాలని కేంద్ర మంత్రి గడ్కరీని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తిపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ మేరకు ఆగష్టు 15న కేంద్రం నిర్వహించే ఫైనాన్స్ మీటింగ్ లో ఎన్ హెచ్- 65 విస్తరణను ఆమోదిస్తామని తెలిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలిచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఇక సంగారెడ్డి- చౌటుప్పల్ రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసిన విషయాన్ని గడ్కరీకి వివరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అలాగే చింతల్ కుంట చెక్ పోస్ట్ టూ హయత్ నగర్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు దాదాపు 5.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా నిర్మించాలని.. అంతేకాక నాగ్ పూర్ లో మాదిరిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Hyderabad-Vijayawada NH-65 Set for 6-Lane Upgrade Tenders Coming Soon

హైదరాబాద్- శ్రీశైలం రోడ్డ్ జాతీయ రహదారిలో టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తున్న ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా గుర్తించడం, హైదరాబాద్ - మన్నెగూడ రహదారికి సహకరించడం, ఉప్పల్ ఫ్లైఓర్ పనులు.. తదితర అంశాలపై చర్చించారు. అన్ని అంశాలను త్వరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+