"హైడ్రా" సూపర్ సక్సెస్.. రూ.3,000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం..!

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తూ దూసుకుపోతుంది "హైడ్రా". చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ టీమ్ సూపర్ సక్సెస్ ఫుల్ గా పని చేస్తోంది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని.. ఫీల్డ్‌లోకి దిగి తక్షణ చర్యలు చేపడుతోంది. ఎక్కడ సమస్య ఉందో అక్కడే ప్రత్యక్షమై, యాక్షన్ మొదలు పెడుతూ ఆక్రమణలకు గురైన భూములకు విముక్తి కలిగిస్తోంది. ఇప్పుడు మరోసారి ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది.

ఈ మేరకు హైడ్రా (HYDRA) యంత్రాంగం మియాపూర్ ప్రాంతంలో మరో భారీ భూకబ్జా ప్రయత్నాన్ని భగ్నం చేసింది. బహిరంగ మార్కెట్ ప్రకారం మూడు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. తప్పుడు పత్రాలతో జరుగుతున్న ఈ భూకబ్జా యత్నాలను సమర్థంగా అడ్డుకుందని అధికారులు వెల్లడించారు.

hydra-team-saves-rs-3-000-crore-government-land-acquisition

ఈ ఆపరేషన్‌లో భాగంగా.. మియాపూర్ విలేజ్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేట సర్వే నంబర్ 44లో గల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. గతంలో 'హైడ్రా ప్రజావాణి'కి అందిన ఫిర్యాదుల మేరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ దర్యాప్తు ప్రారంభమైంది.

కాగా ఇదే సర్వే నంబర్‌లో గతంలోనూ హైడ్రా ఐదు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా మియాపూర్ - బాచుపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న చెరువు కట్టపై అక్రమంగా నిర్మించిన 18 షట్టర్లను కూడా అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా నిరంతరం కృషి చేస్తోంది. మక్తా మహబూబ్‌పేట భూములకు సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్లు, ఒక సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ వంటి ఉదంతాల నేపథ్యంలో హైడ్రా అధికారులు మరోసారి లోతైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో సర్వే నంబర్ 44లో గల మొత్తం 43 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో కబ్జా చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

ఇందులో భాగంగా సర్వే నంబర్ 159కి చెందిన నకిలీ పత్రాలను ఉపయోగించి, సర్వే నంబర్ 44లోని ఎకరన్నర ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్న 15 ఎకరాల భూమి చుట్టూ కంచె వేసి, కబ్జా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ భారీ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటంతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+