కేసీఆర్ కుటుంబానికి నేనే సూసైడ్ స్క్వాడ్: మంత్రి కమలాకర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: తాను తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సూసైడ్ స్క్వాడ్‌ని అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలు శాశ్వతం కాదని, కేసీఆర్ అభిమానం శాశ్వతమని ఆయన అన్నారు. కరీంనగర్ పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి కమలాకర్.. రాంనగర్ మార్కెట్ ఆధునీకరణ పనులకు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగల కమలాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుటుంబానికి తాను ఆత్మాహుతి దళసభ్యుడిగా ఉంటానని అన్నారు. తనకు పదవులు శాశ్వతం కాదన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మాట్లాడటంతోనే దేశ వ్యాప్త చర్చ ప్రారంభమైందన్నారు.

I AM a suicide squad for protect CM KCR family: minister Gangula Kamalakar

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తమ ప్రాంతాల్లోనూ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి కమలాకర్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. కేసీఆర్ ఎలా ఆదేశిస్తే అలా చేస్తానని కమలాకర్ బదులిచ్చారు.

అంతేగాక, సీఎం కేసీఆర్‌‌కి సూసైడ్‌ స్వ్కాడ్‌ని నేను, మళ్లీ మళ్లీ 100 సార్లు చెబుతున్నా.. ఆయనకు, ఆయన కుటుంబానికి నేను సూసైడ్‌స్క్వాడ్‌ను అని మంత్రి అన్నారు. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, రాజకీయం తనకు శాశ్వతం కాదు.. కేసీఆర్ అభిమానం తనకు శాశ్వతం అని కమలాకర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ఏది ఆదేశిస్తే.. అది తూ.చ తప్పకుండా చేస్తా... రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా... తాను ఆయన వెంబడి ఉంటా...కేసీఆర్‌ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం. కేసీఆర్‌ జాతీయా రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+