నిరంజన్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా: ఆ ‘చైనా వ్యక్తి’ ఎవరంటూ రఘునందన్ రావు సంచలనం

హైదరాబాద్: మంత్రి నిరంజన్ రెడ్డిపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. నిరంజన్ రెడ్డికి సంబంధించిన ఫాంహౌస్‌లపై, భూ అక్రమాలపై కొద్ది రోజులుగా రఘునందన్ రావు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో మంత్రి నిరంజన్ రెడ్డి తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు. ఆరోపణలు చేసిన రఘునందన్ రావు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. దీన్ని రఘునందన్ రావు స్వాగతించారు.

సోమవారం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) మరోసారి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. నిరంజన్ రెడ్డి(Niranjan reddy)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఫాంహౌస్ భూమికి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలకు నిరంజన్ రెడ్డి వివరణపై రఘునందన్ తాజాగా స్పందించారు. మంత్రి నిరంజన్ రెడ్డి సూటిగా కాకుండా అనేక విషయాలను దాటవేశారని అన్నారు.

 I will complaint to ED on minister Niranjan reddy scams: MLA Raghunandan Rao

ఆర్డీవో కార్యాలయంలో దస్త్రాలుంటే రైతులకు ఎందుకు పహానీలు ఇవ్వడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. చైనా పౌరుడితో నిరంజన్ రెడ్డి తరచూ మాట్లాడారని.. చైనవా వాసి 'మో' వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని ఈడీని కోరతానని ఆయన తెలిపారు.

చైనాకు చెందిన మో అనే వ్యక్తితో మంత్రి నిరంజన్ రెడ్డికి సంబంధం ఏంటో? చెప్పాలని డిమాండ్ చేశారు. చైనా వ్యక్తికి మంత్రి నిరంజన్ రెడ్డి అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నారని ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు.

మంత్రి దత్త పుత్రుడు గౌడ్ నాయక్‌పై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ దత్తపుత్రిడికి అప్పగిస్తున్నారని ఆరోపించారు. అగ్రికల్చర్ వర్సిటీ వీసీగా నిరంజన్ రెడ్డి తన వియ్యంకుడిని నియమించారని రఘునందన్ రావు ఆరోపించారు.

అంతేగాక, మంత్రి పొలం, ఇల్లు రూ. 4 కోట్లకే అమ్ముతానంటే కొంటానని అన్నారు. ఆయన భూమి వరకు 3 కిలోమీటర్లు సీసీ రోడ్డు వేశారన్నారు. ఈ సీసీ రోడ్డును రైతులతో కలిసి వేసుకున్నట్లు మంత్రి చెప్పారని తెలిపారు. రూ. 5 కోట్ల ఖర్చు అయ్యే సీసీ రోడ్డును రైతులు చందాలు వేసుకుని నిర్మించారా? అని ప్రశ్నించారు రఘునందన్ రావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+