దంచి కొడుతున్న వర్షాలు - హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
రాష్ట్రంలో ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ లో వర్షం కురుస్తూనే ఉంది. ఇదే సమయంలో వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు చేసింది. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని 16 జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం నాటికి దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ - వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి ఒకటి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో రాష్టంలోని లు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిస్తాయని అంచనా వేసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోభారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్స్ జారీ చేసారు.

రెండు రోజులు భారీ వర్షాలు
కాగా, మంగళవారం రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. కాగా, అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ లో 5.8 సెమీ వర్షం నమోదైంది. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరమై బయటకు వస్తే తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇక.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. జిల్లాల అధికారులకు కీలక సూచనలు చేసింది. కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.












Click it and Unblock the Notifications