రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం ముహూర్తం ఇదే: కేసీఆర్ దీక్షపై కోమటిరెడ్డి సంచలనం
వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా రాంరెడ్డి గార్డెన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లలో ఎవరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి.. కూలిపోయే కాళేశ్వరం కట్టారని విమర్శించారు.
తమ ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచే ప్రజా ప్రభుత్వం పడిపోతుందని విమర్శించారని మండిపడ్డారు. వచ్చే మూడేళ్లలో ప్రతీ ఊరికి బీటీ రోడ్, మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తరణ చేస్తామని చెప్పారు. సంక్రాంతికి ఎకరాకు 7వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఇక, తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన దీక్ష గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ది నకిలీ దీక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు. బూస్ట్ తాగుతూ.. సెలైన్లు, విటమిన్స్ తింటూ దీక్ష చేసి పెద్ద త్యాగం చేసినట్లు సీన్ క్రియేట్ చేస్తున్నారు. కానిస్టేబుల్ కిష్టయ్యది, శ్రీకాంతాచారిది నిజమైన త్యాగమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు సోనియా గాంధీ నిర్ణయంతోనే జరిగిందని చెప్పారు.
తాను నల్గొండ చౌరస్తాలో 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అయితే, కేసీఆర్‌లా ఎప్పుడు ప్రచారం చేసుకోలేదన్నారు. మూడేళ్లు మంత్రి పదవి ఉండగానే తాను రాజీనామా చేసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.
మరోవైపు, కేసీఆర్ దీక్షపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు కూడా తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ చేసింది ఫేక్ దీక్ష అని అన్నారు. దీక్ష సమయంలో కేసీఆర్ జ్యూస్, మెడిసిన్ తీసుకున్నారని చెప్పారు. కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నాడని అప్పుడే మీడియాకు చెప్పానని అన్నారు. హరీశ్ రావు చస్తానంటూ బెదిరించి పెట్రోల్ తెచ్చుకున్నారని.. కానీ, అగ్గిపెట్టె లేదని ఆగిపోయారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఉద్యమకారులను రెచ్చగొట్టి 1200 మంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు. కేసీఆర్ దొంగ దీక్ష దివాస్ పై కమిటీ వేసి దర్యాప్తు జరపాలని రేవంత్ రెడ్డి సర్కారును డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక, చనిపోయిన 1200 మంది అమరవీరుల కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications