Telangana Inter Exams2023: ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఒక నిమిషం నిబంధన అమలు..
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమైయ్యాయి.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి.
రాష్ట్రంలో 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,03,000 మంది విద్యార్ధులు హాజరవుతుండగా. మొదటి సంవత్సరం 4,84,197 మంది, ద్వితీయ సంవత్సరానికి 5,19,793 మంది హాజరుకానున్నారు.
ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమేరా నిఘా ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏవిధమైన సెల్ ఫోన్లు, డిజిటల్ వాచ్, బ్లూటూత్, ట్యాబ్‌లు, డిజిటల్ పరికరాలకు అనుమతి లేదని ఇంటర్ బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు. ప్రతి 20 నుంచి 25 కేంద్రాలకు ఒక అంబులెన్స్ కూడా సిద్ధం చేశారు. కాగా ఈసారి కూడా ఒక నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు.

పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ఒక నిమిషం లేట్ వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించారు.
ఏ ఇబ్బంది వచ్చినా 040-24601010, 040-24655027 ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. ఇవి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయన్నారు. కాలేజీలతో ప్రమేయం లేకుండా స్టూడెంట్లే బోర్డ్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications