సీఎస్ తప్పిదం వల్లే మిస్టేక్ : ఇంటర్ ఫలితాల గందరగోళంపై బోర్డు క్లారిటీ

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల జాబితాలో దొర్లిన తప్పులపై బోర్డు స్పందించింది. వీటితో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సూచించింది. కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరైనా ఇంటర్ సర్టిఫికెట్లలో ఏఎఫ్, ఏపీ అని రావడంపై ఆందోళన చెందారు. పరీక్షకు రాకుంటే ఆబ్సెంట్ అని ఉండాలి తప్పా మార్కుల జాబితాలో ఇలా రావడం ఏంటని మదనపడ్డారు.

inter result mistake superintendent fault : board

సూపరిండెంటెండ్ తప్పిదమే ..
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఇంటర్ బోర్డు స్పందించింది. చీఫ్ సూపరిండెంటెంట్ తప్పిదం వల్లే మూడు మెమోల్లో తప్పులు దొర్లాయని బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఆ విద్యార్థులకు పరీక్షలకు హాజరైనా .. చీఫ్ సూపరింటెండెంట్ బ్లాంక్ బార్ కోడ్ వివరాలను బోర్డును సమర్పించారని గుర్తుచేశారు. దీంతో వారి మార్కులు మెమోలో నమోదు కాలేదని వివరించారు. తర్వాత ఆ వివరాలను పరీక్ష కేంద్రం నుంచి సేకరించి .. విద్యార్థుల మెమోలో పొందుపరిచి, కాలేజీలకు పంపిస్తామని స్పష్టంచేశారు.

ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్, ఫలితాల ప్రకటనలో పారదర్శకత, బాధ్యతతో తప్పులు లేకుండా నిర్వహించామని పేర్కొన్నారు. ఫలితాలపై ఆందోళన చెందొద్దని .. ఎవరికైనా సందేహాలు ఉంటే 040-24600110 నంబర్‌కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+