ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. తెలంగాణలో ఆరుగురు విద్యార్ధులు ఆత్మహత్య
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు మరోసారి విషాదాన్ని నింపుతున్నాయి. ఏప్రిల్ 22వ తేదీ నాడు.. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని లేదా ఫెయిల్ అయ్యామన్న ఆవేదనతో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
మొత్తంగా ఇప్పటివరకు క్షణికావేశంతో ఆరుగురు విద్యార్థులు బలవన్మరణం చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మంచిర్యాల జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరు, హైదరాబాద్ లో ముగ్గురు, మేడ్చల్ పరిధిలో ఒకరు మృతి చెందారు.

మృతి చెందిన వారి వివరాలు..
- మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో అశ్విత అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని తక్కువ మార్కులు రావడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
- యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురానికి చెందిన ఓ విద్యార్థి, ఫెయిలైనందుకు మనస్తాపానికి గురై బలవన్మరణం చెందాడు.
- హైదరాబాద్ మోతీనగర్ సమీపంలోని అవంతినగర్‌కు చెందిన ఓ యువకుడు, బల్కంపేటలోని ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ చదువుతున్నాడు. ఫెయిలవడంతో తీవ్ర దిగులుతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరి వేసుకున్నాడు.
- నాగోలు తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని, ఒక సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురై ప్రాణం తీసుకుంది.
- బంజారాహిల్స్ ఇందిరానగర్‌కు చెందిన నిష్ఠ అనే విద్యార్థిని కెమిస్ట్రీలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంది.
- మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందిన మరో విద్యార్థిని, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఆశించిన మార్కులు రాకపోవడంతో బలవన్మరణానికి పాల్పడింది.
విద్యార్ధులకు సూచనలు..
పరీక్షలు ఫలితాలు మన భవిష్యత్తుకు మంచి మార్గం చూపేవి మాత్రమే. అంతే కానీ ఫెయిల్యూర్, ఓటమి అనేది ముగింపు కాదు. అవి ఒక గొప్ప ప్రారంభానికి ఆరంభం లాంటివి. ఒక్క ఫెయిల్యూర్‌తో జీవితం ఆగిపోదు. మీ విలువను మార్కులు నిర్ణయించలేవు. విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగాలి.. పరీక్షలు మళ్లీ రాసుకునే అవకాశం ఉంటుంది కానీ జీవితాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోలేం. క్షణికావేశంలో ంఈ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చకండి.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications