intermediate: ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్.. ఇవి తెలుసుకోండి..!
intermediate Practicals: ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ బోర్డు ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేపట్టింది. ప్రాక్టికల్ పరీక్షల్లో అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏదైనా తప్పు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కాగా ఈ ప్రాక్టికల్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల కళాశాలలకు చెందిన 4,16,622 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఎంపీసీ స్టూడెంట్లు 2,17,714 మంది ఉండగా..బైపీసీ విద్యార్థులు 1,04,089, ఒకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు 48,277, ఒకేషనల్ రెండో సంవత్సరం విద్యార్థులు 46,542 మంది ఉన్నారు.

ప్రాక్టికల్ పరీక్షల కోసం తెలంగాణ వ్యాప్తంగా 2,032 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు మార్నింగ్ సెషన్ లో ఉదయం తొమ్మిది గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం సెషన్ లో 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లను కాలేజీలకు పంపించామని ఇంటర్ బోర్డు పేర్కొంది.
విద్యార్థులు తమతమ కాలేజీల్లో హాల్ టికెట్ తీసుకోవాలని సూచించారు. ప్రాక్టికల్ ప్రశ్నాపత్రాలను ఆన్ లైన్ పెడతారు. ఎగ్జామినర్ వచ్చి పాస్ వర్డ్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని డౌన్ లోడ్ చేస్తారు. అరగంట ముందు మాత్రమే ప్రశ్నాపత్రం విడుదలవుతుంది. వాల్యుయేషన్ కూడా వెంటనే చేసేలా ఏర్పాట్లు చేశారు. వాల్యుయేషన్ పూర్తి మార్కులను ఆన్ లైన్ లో పొందుపరచనున్నారు.












Click it and Unblock the Notifications