గులాబీ ద‌ళంలో క‌ల‌వ‌రం..! ఎందుకు ఈ అస‌హ‌నం..!!

Recommended Video

    ఉద్య‌మ‌కారులకు స‌ముచిత స్థానం క‌ల్పిండంలో గులాబీ బాస్ విఫ‌లం చెందారా..?

    అంతా సూప‌ర్..! ప్ర‌జ‌ల ప్ర‌తిస్పంద‌న భేష్..! ప్ర‌భుత్వ ప‌ని తీరుప‌ట్ల అన్ని వ‌ర్గాల్లో సంత్రుప్తి..! ఎదురులేని పాల‌న‌..! ఇదీ తెలంగాణ ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల భావ‌న‌..!! కాని క్షేత్ర స్ధాయిలో ప్ర‌జ‌ల మ‌నోభావాలు మ‌రోలా ఉన్నాయ‌నే విష‌యాన్ని అదే ప్ర‌భుత్వ పెద్ద‌లు గ్ర‌హించ‌లేక పోతున్నారు. స‌మ‌స్య‌లు ఎక్క‌డో లేవు.. ప్ర‌భుత్వ పెద్ద‌ల్లోనే ఉన్నాయ‌నే స‌త్యాన్ని విస్మ‌రిస్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్, కేటీఆర్, క‌విత స‌భ‌ల‌కు జ‌నం పెద్ద సంఖ్య‌లో హాజ‌రై కేరింత‌లు కొడుతున్న‌ప్ప‌టికి ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల ఏదో తెలియ‌ని అస‌హ‌నం వెంటాడుతోంది. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో ప్ర‌భుత్వ అశ్ర‌ద్ద‌, తెలంగాణ ఉద్య‌మంలో నిఖార్సుగా ప‌నిచేసింది ఎవ‌రు..? అదికారాన్ని అనుభ‌విస్తుంది ఎవ‌రు..? అనే అంశాల‌పై తెలంగాణ ప్ర‌జ‌లు నిశితంగా ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌ష్ట‌ప‌డింది ఒక‌రైతే ఫ‌లితం అనుభ‌విస్తుంది మ‌రొక‌రా..? ఉద్య‌మంలో జైలు జీవితం అనుభ‌వించింది ఒక‌రైతే అదికారాన్ని అనుభ‌విస్తుంది మ‌రొక‌రా..? అనే దిశ‌గా తెలంగాణ ప్ర‌జానికం యోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

    ప్ర‌భుత్వం అనుకున్నంత ఆద‌ర‌ణ క్షేత్ర స్థాయిలో లేదా.. ?

    ప్ర‌భుత్వం అనుకున్నంత ఆద‌ర‌ణ క్షేత్ర స్థాయిలో లేదా.. ?

    మౌన ముద్ర‌లో హ‌రీష్ రావు, ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్ లో కేటీఆర్, క‌విత వేధాంతం, నాయిని న‌ర‌సింహారెడ్డి మాట‌ల‌పై అదుపు కోల్పోవ‌డం, తెలంగాణ అదికార పార్టీలో ఎందుకిలా.. అక‌స్మాత్తుగా వీరిలో ఎందుకింత నైరాశ్యం. మ‌రో ఇర‌వై ఏళ్లు గులాబీ పార్టీదే అధికారం అని ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేసిన నేత‌ల్లో ఎందుకీ క‌ల‌వ‌రం. అస‌లేం జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం గుట్టుగా ఉన్నాయ‌నుకున్న త‌ప్పిదాలు.. అవినీతి ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌నేది తెలుసుకున్నారా..! ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ లేదా.. సీబీఐ చూపు తెలంగాణ వైపు ఉన్నాయ‌నే ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు ఏమైనా అందాయా! ప్ర‌తిప‌క్షాలు పండుగ చేసుకునేలా, అధికార ప‌క్షం కుంగిపోయేలా ఏం జ‌రిగింద‌నేది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

    పార్టీలో హ‌రీష్ ప్రాముఖ్య‌త త‌గ్గిందా..? ప‌థ‌కాలు స‌రైన ఫ‌లితాలు ఇవ్వ‌డం లేదా..?

    పార్టీలో హ‌రీష్ ప్రాముఖ్య‌త త‌గ్గిందా..? ప‌థ‌కాలు స‌రైన ఫ‌లితాలు ఇవ్వ‌డం లేదా..?

    అదికార పార్టీలో ఈ జాడ్యం ఇప్పుడు మొద‌లైంది కాదు. వ‌రంగ‌ల్‌లో ప‌ది ల‌క్ష‌ల మందితో స‌భ ఏర్పాటు చేసిన‌పుడు, ఏకంగా గిన్నిస్ రికార్డు కోసం ప్ర‌య‌త్నించిన టీఆర్ఎస్ కు తొలి భంగ‌పాటు ఎదురైంది. జ‌న‌స‌మీక‌ర‌ణ‌లో హ‌రీష్ అండ్ కో అట్ట‌ర్ ప్లాప్ కావటంతో బాధ్య‌త‌ను పూర్తిగా కేసీఆర్ భుజాన ఎత్తుకున్నారు. ఆ త‌రువాత వ‌చ్చిన‌వే ఈ కులాల వారీగా నిధులు, భ‌వ‌న నిర్మాణాలు, గొర్రెలు, బ‌ర్రెల పంపిణీ, వ‌చ్చే ఖ‌రీఫ్ నుంచి రైతుల‌కు ముంద‌స్తు డ‌బ్బుల పంపిణీ. ఇవ‌న్నీ ఓట్ల‌ను రాల్చుతాయా! అనే అనుమానాలు కూడా కారు పార్టీలో గుబులు రేకెత్తిస్తున్నాయ‌ట‌. దీనికి రెండు మూడు కార‌ణాలున్న‌ట్లుగా ఆ పార్టీ సీనియ‌ర్లే బ‌హిరంగంగా చెబుతున్నారు.

    ఉద్య‌మ‌కారులకు స‌ముచిత స్థానం క‌ల్పిండంలో గులాబీ బాస్ విఫ‌లం చెందారా..?

    ఉద్య‌మ‌కారులకు స‌ముచిత స్థానం క‌ల్పిండంలో గులాబీ బాస్ విఫ‌లం చెందారా..?

    100 సీట్లు గ్యారంటీ అంటూ క‌విత చెబుతున్నా అదంతా క‌ట్టుక‌థే అంటున్నారు. ఎందుకంటే పార్టీను న‌మ్ముకున్న నేత‌లు ఉద్య‌మంలో కేసీఆర్‌కు వెన్నుద‌న్నుగా వున్న వారిని ప‌క్క‌న‌బెట్టి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ వంటి వారికి ప‌ద‌వులివ్వ‌టం పార్టీ నేత‌లు గుర్రుగా ఉండ‌టానికి కార‌ణ‌మ‌య్యాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి సీటు అనేది పూర్తిగా కేసీఆర్ ఫ్యామిలీ చేతిలోనే ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇదిలా ఉంటే కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌, మిష‌న్ భ‌గీర‌థ‌, గొర్రెల పంపిణీ, ఉచిత విద్యుత్ వంటి వాటిలో అవినీతిపై అధికార పార్టీ నోరు మెద‌ప‌లేకుండా ఉంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో రెడ్డి సామాజిక‌వ‌ర్గం కేసీఆర్ నుంచి వేర‌య్యే అవ‌కాశాలున్నాయ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ సానుకూలంగా ఉన్నాయ‌నుకున్న ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మార‌టం, కేసీఆర్ ఎలా ముందుకు తీసుకెళ్తార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

    భ‌విష్య‌త్ పై నీలి నీడ‌లు.. అందుకే స‌ర్వేలు.. ఐనా అసంత్రుప్తి..!

    భ‌విష్య‌త్ పై నీలి నీడ‌లు.. అందుకే స‌ర్వేలు.. ఐనా అసంత్రుప్తి..!

    ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. తాజాగా రైతు బంధు పథకంతో సంతోషంగా వున్న గ్రామీణ ప్రజలంతా తమవైపే వుంటారనేది టీఆర్ఎస్ ప్రభుత్వం అంచనా. అందుకే సర్వేల ద్వారా ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. కాగా రైతు బందు ప‌ధ‌కం ప‌ట్ల చిన్న స‌న్న కారు రైతుల‌తో పాటు, కౌలు రైతులనుండి వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. రైతుబంధు ప‌ధ‌కం ద్వారా బ‌డా భూస్వాముల‌కే ప్ర‌యోజ‌నం జ‌రుగుతోంది త‌ప్ప కౌలు మీద ఆదార‌ప‌డి బ‌తికే రైతుల‌కు కాద‌నే అభిప్ర‌యం వ్య‌క్తం అవుతోంది. దీంతో రైతు బంధు ప‌థ‌కం పూర్తి స్థాయిలో విజ‌య‌వంతం అయ్యిందా అంటే సందిగ్ద‌త వ్య‌క్తం చేస్తున్నారు రైతులు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+