కవిత-హరీష్ రావులకు అలా చెక్: థర్డ్ కోసం కేసీఆర్, కేటీఆర్ కోసం వ్యూహాత్మక అడుగు?

Recommended Video

    Kcr Intellectual Steps For Coming Politics... థర్డ్ కోసం కేసీఆర్, కేటీఆర్ వ్యూహాత్మక అడుగు?

    హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు థర్డ్ ఫ్రంట్ గళం ఎత్తారు. ఈ ప్రకటనతో టీఆర్ఎస్‌లోను సమీకరణాలు మారుతున్నాయనే ప్రచారం సాగుతోంది. రాబోయే రోజుల్లో కేటీఆర్ సీఎం పదవి చేపట్టడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చాపకింద నీరులా వ్యూహాలు సాగుతున్నాయట.

    టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత.. కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇటీవల వచ్చిన సంతోష్ రావుల గ్రూపులు ఉన్నట్లుగా వాదనలు వినిపిస్తుంటాయి. మిగతా గ్రూప్‌లన్నింటికి చెక్ పెడుతూ కేటీఆర్‌ను ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు.

     ఈ నలుగురిలో ఎవరికి?

    ఈ నలుగురిలో ఎవరికి?

    కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు ఆయన తర్వాత హరీష్ రావు అన్నట్లుగా ఉండేది. ఆ తర్వాత కేటీఆర్, కవితలు అమెరికా నుంచి వచ్చి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. 2009 తర్వాత నుంచి హరీష్ రావు, కవిత, కేటీఆర్ గ్రూప్‌లు ఏర్పడ్డాయనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి తోడు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ రావు చేరారని అంటున్నారు.

    కేసీఆర్ వారసుడిపై చర్చ

    కేసీఆర్ వారసుడిపై చర్చ

    కేసీఆర్ వారసుడు ఎవరు అనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. దీనిని టీఆర్ఎస్ వర్గాలు ఎప్పటికి అప్పుడు కొట్టి పారేస్తున్నాయి. కేసీఆర్ మరో ఇరవై ముప్పై ఏళ్లు పాలిస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ తనంతట తానే థర్డ్ ప్రంట్ అని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని చెప్పడం ద్వారా మరోసారి వారసుల అంశం చర్చనీయాంశంగా మారింది.

     వ్యూహాత్మకంగా పావులు

    వ్యూహాత్మకంగా పావులు

    ముందు నుంచి ఉన్న హరీష్ రావు, 2004 నుంచి కేసీఆర్‌కు అండగా నిలబడిన సంతోష్ కుమార్, కొడుకు కేటీఆర్, కూతురు కవితలు రేసులో ఉన్నప్పటికీ.. కేటీఆర్‍‌ను వారసుడిగా తెచ్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు.

    ప్రభ తగ్గుతోంది

    ప్రభ తగ్గుతోంది

    రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు అప్పగించిన అనేక కార్యక్రమాలను హరీష్ రావు విజయవంతంగా పూర్తి చేశారని, కానీ ఆయనకు మంత్రివర్గంలో తాను నిర్వహిస్తున్న శాఖలకే పరిమితం చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ప్రభుత్వంలో, పార్టీలో కేటీఆర్‌తో పోల్చుకుంటే హరీష్ ప్రభ తగ్గుతోందని అంటున్నారు.

     కేటీఆర్ చుట్టు కేంద్రీకృతం

    కేటీఆర్ చుట్టు కేంద్రీకృతం

    కేటీఆర్ చుట్టు అధికారం కేంద్రీకృతమై ఉందని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు మొదలు వరుసగా పరిణామాలు చూస్తుంటే కేటీఆర్‌కు ఇచ్చిన ప్రాధాన్యం తెలిసిపోతోందని అంటున్నారు. కవిత ఆద్వర్యంలో నడిచే తెలంగాణ జాగృతి శాఖలను కూడా ఇటీవల రద్దు చేశారు.

     తెలంగాణ జాగృతి

    తెలంగాణ జాగృతి

    తెలంగాణ జాగృతిలోను రాజకీయ ఆకాంక్షలతో పని చేసేవారు పెరగడం, వచ్చే ఎన్నికల్లో జాగృతి బాధ్యుతుల్లో కొందరు టిక్కెట్లు ఆశిస్తుండటంతో కమిటీలు రద్దు చేశారని అంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి ఓ స్వచ్చంధ సంస్థలాగే కొనసాగనుందని అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండటంతో కేటీఆర్ కాబోయే సీఎం అనే అభిప్రాయం అందరిలోను ఉందని అంటున్నారు.

     పలువురి అనుమానం

    పలువురి అనుమానం

    వచ్చే ఎన్నికల్లో కవిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే మరో పవర్ గ్రూప్ అవుతుందని భావిస్తుండటంతో ఆమెను తిరిగి నిజామాబాద్ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారట. హరీష్ రావు నుంచి కూడా పోటీ లేకుండా ఉండేందుకు ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. జోగినపల్లి సంతోష్ రావును రాజ్యసభకు పంపించాలని చూస్తున్నారని అంటున్నారు. కేటీఆర్‌కు కేసీఆర్ అన్ని క్లియర్ చేస్తున్నారట. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంలు ఇదే అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటున్నారని విమర్శించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+