పుచ్చలపల్లి సుందరయ్యపై టీ మంత్రి సంచలనవ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటం పైన పుచ్చలపల్లి సుందరయ్య రచించిన గ్రంథంలో సమస్త సమాచారం, అనుభవాలు భీంరెడ్డి నర్సింహారెడ్డివి అయితే సుందరయ్య మాత్రం ఆయన పేరే వేసుకొని ఖ్యాతి గడించారని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నాడు జరిగిన భీంరెడ్డి నర్సింహా రెడ్డి వర్ధంతి సభలో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు.

1972లో జైలులో ఉన్న సమయంలో భీంరెడ్డి నర్సింహా రెడ్డి ఇచ్చిన సలహాలు, సూచనలు, అనుభవాల మేరకే సుందరయ్య తెలంగాణ సాయుధ పోరాటంపై పుస్తకాన్ని తెచ్చారన్నారు. కానీ ఎక్కడా భీంరెడ్డి పేరు ప్రస్తావించలేదన్నారు. ఈ విషయంలో భీంరెడ్డి అప్ప్లో సుందరయ్యను నిలదీసినందుకే అధికారికంగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించే ధైర్యం చేయలేదన్నారు.
సుందరయ్యను అవమానించాలని తన ఉద్దేశ్యం కాదని, తెలంగాణ చరిత్రలో భీంరెడ్డి పాత్ర మనసకబారుతుండటం వల్లే తాను ఇలా చెప్పవలసి వచ్చిందన్నారు. బీంరెడ్డి స్మారకార్థం సూర్యాపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, మరో నాయకుడు ధర్మభిక్షం విగ్రహాన్ని కూడా నిర్మిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications