అవార్డు కోసం లండన్‌లో జనసేనాని: అభిమానుల కోసం పవన్ కళ్యాణ్

లండన్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నారు. ఆయనకు అక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. దాదాపు ఆయన ఎక్కడకు వెళ్లినా జనా

హైదరాబాద్: లండన్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నారు. ఆయనకు అక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. దాదాపు ఆయన ఎక్కడకు వెళ్లినా జనాలు తండోపతండాలుగా వస్తారు.

 పవన్‌కు ఎక్సలెన్సీ అవార్డు

పవన్‌కు ఎక్సలెన్సీ అవార్డు

ఇప్పుడు పవన్ కళ్యాణ్ యూరోపియన్ బిజినెస్ ఫోరం (ఐఈబీఎఫ్) అందించే ఎక్సలెన్సీ అవార్డును అందుకునేందుకు లండన్‌లో ఉన్నారు. లండన్ కాలమానం ప్రకారం నవంబర్ 17వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ అవార్డు కార్యక్రమం జరగనుంది.

 ఈ గ్యాప్‌లో అభిమానులను కలుసుకునేందుకు

ఈ గ్యాప్‌లో అభిమానులను కలుసుకునేందుకు

ఈ గ్యాప్‌లో ఆయన తన అభిమానులను కలుసుకునేందుకు సమయం కేటాయించారని తెలుస్తోంది. అభిమానులనే కాకుండా యూరప్ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతోను ఆయన ముచ్చటించనున్నారు.

 తిరుగు ప్రయాణం

తిరుగు ప్రయాణం

లండన్ చేరుకున్నప్పటి నుంచి తిరుగు ప్రయాణం అయ్యే లోపు అక్కడున్న జనసేన కార్యకర్తలను, అభిమానులను కలుసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారని తెలుస్తోంది.

 జనసేన కార్యక్రమాల్లో బిజీ

జనసేన కార్యక్రమాల్లో బిజీ

కాగా, సినిమా షూటింగులో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అవార్డు తీసుకునేందుకు ప్రత్యేకంగా లండన్ చేరుకున్నారు. సినిమాలు వేగంగా పూర్తి చేసి త్వరలో జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీ కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+