తెలంగాణ ఎన్నికల్లో చేతులెత్తేసిన జనసేన, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు చేదువార్త
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అధికారికంగా ప్రకటన చేయలేదు. నామినేషన్ల పర్వం ముగిసిన రోజైన సోమవారం ఆయన అభిమానులకు చేదువార్త చెప్పారు. పోటీపై చేతులెత్తేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు.
నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే ఏయే అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై జనసేనకు ఒక ప్రణాళిక ఉందని చెప్పారు. అయితే ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన తమ పార్టీకి బరిలో నిలవడం కష్టతరమని భావించి పోటీ విరమించుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగిందని, శాసనసభ ఎన్నికల్లో కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగబోయే లోకసభ ఎన్నికలలో పోటీ చేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లోకసభ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమయాత్తం అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications