రేవంత్ మార్క్ సెలెక్షన్..!!

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. గేరు మార్చింది. టాప్ స్పీడ్‌ను అందుకుంది. ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను జనంలోకి తీసుకెళ్లడంతో పాటు భారత్ రాష్ట్ర సమితి సహా ఇతర ప్రతిపక్షాల దూకుడుకు మూకుతాడు వేయడానికి ఏకకాలంలో ప్రాధాన్యతను ఇస్తోంది.

మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు.. వంటి సంక్షేమ పథకాలతో జనంలోకి దూసుకెళ్తోంది కాంగ్రెస్. ఇందిరమ్మ పరిపాలనగా పేరు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. మహిళా సాధికారత, రైతాంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతినెలా 2,500 రూపాయల ఆర్థిక సహాయం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

Janga Srinivasa Rao and Kailash Sajjan are appointed as Social Media secretaries for the TPCC

రైతు భరోసా కింద రుణమాఫీని ప్రకటించింది. ప్రతి ఎకరాకు ఏటేటా 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక భరోసాను అందిస్తోంది. వరి పంటకు మరో 500 రూపాయలను బోనస్‌గా కూడా ప్రకటించింది. చేయూత వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా రోగులు, ఎయిడ్స్ రోగులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తోంది.

వీటన్నింటినీ ముమ్మరంగా జనంలోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. గ్రామీణ ప్రజల వరకూ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చేరవేసేలా చర్యలు తీసుకుంటోంది. అలాగే- ప్రతిపక్షాల విమర్శలు, రాజకీయపరమైన విమర్శలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టేలా సోషల్ మీడియా విభాగాన్ని తీర్చిదిద్దుకుంటోంది.

ఈ క్రమంలో సోషల్ మీడియా విభాగానికి కొత్తగా మరో ఇద్దరు కార్యదర్శులను అపాయింట్ చేసింది. కైలాష్ సజ్జన్, జంగా శ్రీనివాసరావును కార్యదర్శులగా నియమించింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ సోషల్ మీడియా విభాగం ఛైర్మన్ మన్నే సతీష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+