తెలంగాణలో సీఎం అయ్యేది ఎవరు - తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్యులు..!!
తెలంగాణ ఎన్నికలు ఉత్కంఠగా మారుతున్నాయి. బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ మధ్య పోటీ హోరా హోరీగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనేది కాంగ్రెస్ లక్ష్యం. హ్యాట్రిక్ సాధించాలనేది సీఎం కేసీఆర్ టార్గెట్. ఇప్పటికే పలు సర్వే సంస్థలు కాంగ్రెస్ కే అధికారం అని తేల్చాయి. తాజాగా ప్రముఖ జ్యోతిష్కులు..న్యూమరాలజిస్టులు తెలంగాణ ఎన్నికల ఫలితాలపైన తమ అంచనాలను వెల్లడించారు. ఆసక్తి కర విశ్లేషణ చేస్తున్నారు.
కాంగ్రెస్ అనుకూలంగా : తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. 80 సీట్ల కంటే ఒక్కటి కూడా తగ్గదని తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ సవాల్ చేసారు. కేసీఆర్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని ఎద్దేవా చేసారు. దీనికి రేవంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. పలు సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. అందులో మెజార్టీ సంస్థలు కాంగ్రెస్ కు అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయని..కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ఇక, ఈ నెల 28వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ లో జోష్ పెంచేలా జ్యోతిష్కులు..న్యూమరాలజిస్టులు అంచనాలను వెల్లడిస్తున్నారు.

జ్యోతిష్యులు తేల్చింది ఇదే : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ప్రముఖ జ్యోతిష్కులు..స్వామీజీలు, న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. వేలూరి రవి కిరణ్ శర్మ గ్రహాలు పూర్తిగా రేవంత్ కు అనుకూలంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంతో కేసీఆర్ కు శని ప్రారంభమయిందని, దీంతో ఓటమి ఖాయమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆగష్టు నెల నుండి రేవంత్ రెడ్డికి గురుడు ప్రారంభం అయిందని, దీంతో ఈ ఏడాది గొప్ప విజయం లభించనుందని విశ్లేషించారు. కాంగ్రెస్ కు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని, 70 సీట్లు రానున్నాయని స్పష్టం చేసారు. న్యూమరాలజిస్టులు సైతం కాంగ్రెస్ కు సంఖ్యా పరంగా 65 నుండి 70 సీట్లు రానున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణలో సీఎం అయ్యేది ఎవరు - తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్యులు..!!#Astrology #Jyothishyam #TelanganaElection2023 #TelanganaElections2023 #Telangana #Oneindiatelugu pic.twitter.com/sA9T1X9f0z
— oneindiatelugu (@oneindiatelugu) November 23, 2023
పెరుగుతున్న జోష్ : ఇక, జాతీయ సర్వే సంస్థల సైతం ఇప్పటికే తెలంగాణలో ప్రజా నాడి తెలుసుకొనే ప్రయత్నం చేసాయి. ఎన్నికల సంఘం ఒపీనియన్ పోల్స్ పైన ఈ నెల 30వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. దీంతో, 30వ తేదీ పోలింగ్ ముగిసిన తరువాత ఈ సర్వేలు బయటకు రానున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ దే పై చేయి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు జ్యోతిష్కులు సైతం తమ అంచనాలను కాంగ్రెస్ కు అనుకూలంగా వెల్లడిస్తున్నారు. క్షేత్ర స్థాయిలోనూ కాంగ్రెస్ గెలుపు పైన చర్చ సాగుతోంది. ఇక, కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. కాంగ్రెస్ కు అన్ని అంశాలు కలిసివస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ సమయంలో ఫలితాల పైన భారీ అంచనాలు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications