Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో కేఏ పాల్..

తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ , బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలకు పదును పెట్టాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రశాంతి పార్టీ కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తనను పోటీ చేయమని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని కేఏ పాల్ తెలిపారు. ఉప ఎన్నికలో విజయం సాధించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని వెల్లడించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

ka-paul-in-the-jubilee-hills-by-election-race

కేఏ పాల్ గ్యారెంటీ హామీలు..

  • నియోజకవర్గంలో ఉన్నవారందరికీ ఉచిత విద్య,
  • కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేదావులు, సంఘ సంస్కర్తలకు సముచిత స్థానం.
  • ప్రశాంతి పార్టీని గెలిపించిన వంద రోజుల్లో జూబ్లీహిల్స్ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతిఒక్క నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం.
  • జూబ్లీహిల్స్ పరిదిలోని విలేఖరులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంవత్సరంలోనే డబుల్ బెడ్ రూం ఉచితంగా కట్టించి ఇవ్వటం.
  • జూబ్లీహిల్స్ స్లమ్ ఏరియాల్లో నీళ్లు, రవాణా, ఆరోగ్యం సదుపాయాలు అందుబాటులోకి తేవడంతోపాటు స్కిల్ డవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు.
  • సినీ పరిశ్రమకు, వ్యాపారస్తులకు, ఐటీ రంగంలోని, మెడికల్ రంగంలోని వారి సమస్యలను పరిష్కరించి వారికి అన్ని విధాల అండగా నిలుస్తాం.
  • నియోజకవర్గంలోని ప్రజలకు ఉచిత వైద్యం సదుపాయం కల్పిస్తామని కేఏ పాల్ తెలిపారు. వీటితో పాటు.. మరికొన్ని హామీలను మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.

ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, భారత రాష్ట్ర సమితి తరఫున సునీత బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఇంకా ఖరారవలేదు. బీజేపీ అభ్యర్థి కూడా ఖరారైన తర్వాత ఒక్కసారిగా రాజకీయం వేడెక్కే అవకాశం ఉంది. నవంబర్ 11వ తేదీన ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగనుంది. ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై కసరత్తు పూర్తి చేయగా సోమవారం నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణలో శాసనసభ్యుల మరణం తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో సానుభూతి పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించట్లేదు. సింపతీ ఓటుబ్యాంకు పని చేయట్లేదు. సానుభూతి ఓట్లు వారి కుటుంబ సభ్యులకు ఆశించిన స్థాయిలో లభించడం లేదు. 2014 తర్వాత జరిగిన అయిదు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది కూడా. అయిదుసార్లు ఉప ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఈసారి ఏం జరగనుందని చర్చ నడుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+