రేవంత్ పై కన్హయ్య కుమార్ సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ సీఎం రేవంత్ పైన సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. బీహార్ డీఎన్ఏ గురించి రేవంత్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యల పైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలా రేవంత్ ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ చేసారు.ఇప్పుడు కన్హయ్య కుమార్ సైతం రేవంత్ ను టార్గెట్ చేసారు. మూర్ఖుడు అంటూ... తెలివి లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఈ వివాదం కాంగ్రెస్ లో సంచలనంగా మారుతోంది.

బీహార్ ఎన్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. ఈ సారి బీహార్ లో బీజేపీని ఓడించాలని మహా ఘట్ బంధన్ తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో రేవంత్ బీహార్ ప్రజల పైన చేసినట్లుగా కొన్ని వ్యాఖ్యలు ప్రచారంలోకి వచ్చాయి. వీటి పైన బీహార్ నేతలు మండిపడుతున్నారు. జన సూరజ్ పార్టీ అధినేత.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ వ్యాఖ్యల పైన మండిపడ్డారు.

Kanhaiya Kumar sensational comments against CM Revanth amid Bihar Elections

అసలు రేవంత్ ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తారని.. డీఎన్ఏ గురించి మాట్లాడే రేవంత్.. తన వద్దకు మూడు సార్లు వచ్చి సాయం ఎలా కోరారని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ చేసారు. ఇక, తాజాగా.. కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ సైతం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇలా వరుసగా రేవంత్ టార్గెట్ అవ్వటం కాంగ్రెస్ కు సమస్యగా మారుతోంది.

కన్హయ్య కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో రేవంత్ కామెంట్స్ పైన స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు అని.. తెలివితక్కువ వాడంటూ ఏకీపారేశారు. బీహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడని, వారి డీఎన్ఏ అంటూ కాంట్రవర్సీగా మాట్లాడటం ఏంటంటూ నిలదీసారు. దొంగతనం చేసే వారిని దొంగలు అని అంటారు.. తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అని అంటారని చెప్పుకొచ్చారు.

రేవంత్ రెడ్డి మా పార్టీ సీఎం అయినా మూర్ఖుడే అని అంటానని.. ఇందులో ఎలాంటి విచారం లేదని తేల్చి చెప్పారు. అటు బీహార్ లో ఎన్నికలు హోరా హోరీగా మారుతున్న వేళ.. సొంత పార్టీ సీఎం చేసిన వ్యాఖ్యల పైన పార్టీ నేతలు మండిపడుతున్నారు. సొంత పార్టీ నేతలే రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందీ.. ఎలాంటి ముగింపు ఇస్తుందనేది పార్టీ నేతల్లో ఆసక్తి కర చర్చగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+