కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..!
కర్ణాటకలో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు కర్ణాటక చాలా దగ్గరగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు నెలవుగా ఉంది. కర్ణాటకలో కూర్గ్, చిక్కమగళూరు లాంటి హిల్ స్టేషన్లు, హంపి, మైసూర్ లాంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అయితే తక్కువ ధరకే కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? పర్యటకుల కోసం తక్కువ ధరకే అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ.
ఈ టూర్ లో భాగంగా హైదరాబాద్ నుంచి తక్కువ ధరలోనే కర్ణాటకను చుట్టి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 8, 15, 22, 29 అలాగే మే 6, 13, 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లుగా కొనసాగుతుంది. ఈ టూర్ పర్యటకులను మంచి అనుభూతిని కలిగిస్తుంది. కాచిగూడ, జడ్చర్ల, గద్వాల్, మహబూబ్ నగర్, కర్నూల్ టౌన్, దోన్ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఎక్కే వీలుంది.
ఈ టూర్ లో భాగంగా కాచిగూడ నుంచి రైలు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 7 గంటలకు రైలు ఉంటుంది. రాత్రంతా జర్నీ చేయాల్సి ఉంటుంది. అలా రెండో రోజు ఉదయం 9 గంటల వరకు మైసూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి వాహనాల్లో కూర్గ్ చేరుకుంటారు. కూర్గ్ నుంచి అబ్బే జలపాతాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఓంకారేశ్వర్ ఆలయం చేరుకుంటారు. మూడో రోజు ఉదయం తల కావేరి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత రాజా సీట్ ను సందర్శిస్తారు.

ఇక నాలుగోరోజు మైసూర్ ను సందర్శిస్తారు. మధ్యలో నిసర్గధామా, టిబెటన్ మొనాస్టరీ తదితర ప్రాంతాలను చేరుకుంటారు. ఆ తర్వాత బృందావన్ గార్డెన్స్ సందర్శన ఉంటుంది ఐదోరోజు చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ సందర్శన ఉంటుంది. వాటి తర్వాత మైసూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ ట్రైన్ ఉంటుంది. రాత్రంతా జర్నీ చేసిన తర్వాత కాచిగూడ చేరుకుంటారు. దాంతో టూర్ ముగుస్తుంది.












Click it and Unblock the Notifications