వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనాభా 10కోట్లకు పెరిగిన ఇబ్బందిలేదు: కవితతో అభ్యర్థుల సెల్ఫీ, నాయిని డ్యాన్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్‌ ఎంపీ కవిత గ్రేటర్ ఓటర్లకు సూచించారు. శనివారం నేరేడ్‌మెట్‌ డివిజన్‌ టిఆర్ఎస్ అభ్యర్థి కె శ్రీదేవి ఆధ్వర్యంలో యాప్రాల్‌లో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికి రోజంతా నీరు అందిస్తామని చెప్పారు.

భవిష్యత్ తరాలకు అందరికీ ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్ జనాభా పదికోట్లకు పెరిగినా ఇబ్బందులు లేకుండా అన్ని వర్గాలకు పనికొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించి పూర్తి అవగాహనతో కేసీఆర్ ముందుకు పోతున్నారని కవిత తెలిపారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తారనే నమ్మకం తనకుందని అన్నారు. ప్రభుత్వం సెటిలర్లను ఎప్పుడూ వేరుగా చూడలేదని, ఇక ముందుకూడా చూడబోదని చెప్పారు. రోడ్ షోలో ఎమ్మెల్యే పుట్ట మధు, హనుమంతరావు, గోపురమణరెడ్డి పాల్గొన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్‌ ఎంపీ కవిత గ్రేటర్ ఓటర్లకు సూచించారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

శనివారం నేరేడ్‌మెట్‌ డివిజన్‌ టిఆర్ఎస్ అభ్యర్థి కె శ్రీదేవి ఆధ్వర్యంలో యాప్రాల్‌లో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికి రోజంతా నీరు అందిస్తామని చెప్పారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

భవిష్యత్ తరాలకు అందరికీ ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

హైదరాబాద్ జనాభా పదికోట్లకు పెరిగినా ఇబ్బందులు లేకుండా అన్ని వర్గాలకు పనికొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించి పూర్తి అవగాహనతో కేసీఆర్ ముందుకు పోతున్నారని కవిత తెలిపారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తారనే నమ్మకం తనకుందని అన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

ప్రభుత్వం సెటిలర్లను ఎప్పుడూ వేరుగా చూడలేదని, ఇక ముందుకూడా చూడబోదని చెప్పారు. రోడ్ షోలో ఎమ్మెల్యే పుట్ట మధు, హనుమంతరావు, గోపురమణరెడ్డి పాల్గొన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

గ్రేటర్‌ ఎన్నికల్లో అండగా నిలబడి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్ధడంలో తెలంగాణ వైద్యులు భాగస్వాములు కావాలని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

తెలంగాణ వైద్యులు, తెలంగాణ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల సంఘం (తానా) ఆధ్వర్యంలో శనివారం కోఠిలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ కవిత హాజరయ్యారు. భారత వైద్య మండలి (ఎంసీఐ) తెలంగాణ శాఖ ఛైర్మన్‌గా నియమితులైన డా.రవిందర్‌రెడ్డిని సన్మానించారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ పునఃనిర్మాణం ఎంతో కీలకమని దీనికి సీఎం కేసీఆర్‌ ఓ విజన్‌తో ముందుకు సాగుతున్నారన్నారు. అనుకున్నవన్నీ సాధించాలంటే గ్రేటర్‌ ఎన్నికల్లో వైద్యులు టిఆర్ఎస్ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

ఇతర పార్టీలు ఎన్ని చెప్పినా, ఏమి మాట్లాడినా.. ప్రజలు ఏ పార్టీపై ఎటువంటి విశ్వాసాన్ని ఉంచుతున్నారనేది ముఖ్యమని, 18 నెలల కేసీఆర్ పాలనపై, టీఆర్‌ఎస్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం వచ్చిందని, ప్రజలు ఈ ఎన్నికల్లో కూడా ఆయనను ఆదరిస్తారని ఎంపీ అన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

కేంద్రం మన హైదరాబాద్‌కు, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కవిత విజ్ఞప్తి చేశారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రలో టీడీపీతో పార్టీతో పొత్తు పెట్టుకున్నది కాబట్టి నిధులు ఆ రాష్ర్టానికే ఇస్తున్నదని ఆమె విమర్శించారు. మోడీ ప్రభుత్వం కేవలం ప్రచారం చేసుకుంటున్నది తప్ప పనిచేయడం లేదని అన్నారు.

కవితతో అభ్యర్థి సెల్ఫీ

కవితతో అభ్యర్థి సెల్ఫీ

కొత్త, పాత నగరాలను కలుపుకొని సరికొత్త విశ్వనగరాన్ని ఏర్పాటు చేయాలని, రోడ్లు, డ్రైన్స్, మంచినీటి సరఫరాలకు సీఎం కేసీఆర్ సమగ్రమైన ప్రణాళికలు రూపొందించారని, పవర్ ఐలాండ్ కోసం కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆమె చెప్పారు.

English summary
TRS MP Kalvakuntla Kavitha on Saturday held campaign in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X