షర్మిలకు కాంగ్రెస్ భారీ ట్విస్ట్, ఎందుకిలా - వాట్ నెక్స్ట్..!!
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక..పార్టీ విలీనం వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటి వరకు ఖాయం అని చెబుతూ వచ్చిన నేతలు ఒక్క సారిగా స్వరం మారుతున్నట్లు కనిపిస్తోంది. సోనియాతో సమావేశం సమయంలో షర్మిల పైన ఆప్యాయత చూపించారు. కానీ, షర్మిల కోరుకున్న విధంగా రాజకీయ ప్రాధాన్యత పైనే ఇప్పుడు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యనేత కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలతో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.
కాంగ్రెస్ వైపు షర్మిల అడుగులు
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ లో చేరటం..పార్టీ విలీనం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల కాంగ్రెస్ నేత సోనియాగాంధీతో వైఎస్ షర్మిల భేటీ అవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సోనియాతో భేటీ పైన స్పందించిన షర్మిల, వైఎస్సార్ పైన సోనియా అభిమానంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో సీబీఐ కేసుల్లో వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్ లో చర్చటం పైన తాను సోనియాతో చర్చించానని వెల్లడించారు. ఆ వ్యవహారం వారికి తెలిసి జరిగిన పొరపాటు కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కానీ, అదే సమయంలో పార్టీ విలీనం పైన మాత్రం స్పందించటానికి నిరాకరించారు. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు.

వేణు గోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇప్పుడు తాజాగా సోనియాతో షర్మిల భేటీపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పందించారు. సోనియాగాంధీతో షర్మిల చర్చలు జరిపారని... సోనియా గాంధీ, రాహుల్ గాంధీని షర్మిల కలిశారని తెలిపారు. వారి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని చెప్పుకొచ్చారు. షర్మిల కూడా ఈ అంశంపై మీడియాతో మాట్లాడారని తెలిపారు. వైఎస్సార్టీపీ పార్టీ విలీనంపై వేచి చూడాలి అంటూ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా షర్మిల నుంచి ఇంకా పార్టీ విలీనం పైన స్పష్టత రాలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణలోనే షర్మిల తన రాజకీయం కొనసాగించాలని కోరుకుంటున్నారు. కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా మరి కొందరు తెలంగాణలో షర్మిల పోటీ..పార్టీలో ప్రాధాన్యత పైన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
షర్మిల ఏం చేయబోతున్నారు
షర్మిలకు మద్దతుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించారు. కానీ, ఇంకా హైకమాండ్ నుంచి షర్మిల పోటీ పైన డైలమా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలోనూ షర్మిల సేవలు వినియోగించుకుంటారనే ప్రచారం తెర పైకి వచ్చింది. కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు ఏపీ ప్రస్తావన లేకుండా, పార్టీలో జాతీయ స్థాయి పదవి షర్మిలకు ఇచ్చేందుకు సిద్దమైనట్లు చెబుతున్నారు. అయితే, షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీపీసీసీ నేతలు పాలేరు విషయంలో తుమ్మలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనా ఆశించిన హామీలు దక్కకపోవటంతో ఇప్పుడు ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారుతోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications